కొనెను, తత్ = ఆహనుమంతునియొక్క, మహా, ఆగః = అపరాధములయొక్క, “ఆగోపరాధో మంతుశ్చ” అని అ. గణ = సమూహముయొక్క, గ్రహోద్భట = ప్రాప్త్యతిశయము, నడువన్ = ప్రవర్తింపఁగా, భటులు, అటు డాసి = హనుమంతునియొద్దకుఁ బోయి, నవ్విరి.
భారత. తత్ = ఆపాండవులయొక్క, సత్త్వ = సత్వముయొక్క, ఉనికియొక్క యనుట, వార్తా = వృత్తాంతముయొక్క, అశ్రుతి = వినకుండుటచేత, తత్సంగర = ఆపాండవప్రతిజ్ఞయొక్క, "ప్రతిజ్ఞాజిసంవిదాపత్సు సంగరః” అని అ. భంగ = చెఱుచుటయందుఁ గల, పరతత్ = తాత్పర్యముచేత, ఉత్తమద్రవిణ = శ్రేష్ఠద్రవ్యములయొక్క, “ద్రవిణం తు బలం ధన" మ్మని అ. సంపత్తిచేత, పౌలస్త్యుండు = కుబేరునివంటివాఁడు, దుర్యోధనుఁడు, తత్పురిలోపలన్ = మత్స్యనగరమందు, ధర్మజ, భీమ, సంక్రందనజ = అర్జునునియొక్కయు, యముల = నకులసహదేవులయొక్కయు, కలిమి = ఉండుటను, ఎంచి, ఆహవ = యుద్ధమందు, కృతిని = నేర్పరియైనవాని, సుశర్ముని = సుశర్మను, ధనుః = వింటియొక్క, ప్రణాద = ధ్వనిచేత, తులిత = సరిపోల్పఁబడిన, అంబునిధి = సముద్రునియొక్కయు, మేఘములయొక్కయు, నాద = ధ్వని గలవాని, సుశర్మకు విశేషణము, పనిచెను = పంపెను, అతఁడును = సుశర్మయు, హరిత్ = దిక్కులయందు, నుత = స్తోత్రము చేయఁబడిన, ఉగ్రాజిని = ఘనయుద్ధమందు, డాసి, అవ్విరటుక్ = ఆవిరాటరాజును, పట్టెను = పట్టుకొనెను, తత్ = ఆవిరటునియొక్క, మహా, గోగణ = గోసమూహముయొక్క, గ్రహ = పట్టుటచేతనైన, ఉద్భటతన్ = ఔద్ధత్యముచేత, నడువన్ = ప్రవర్తింపఁగా, పట్టెనని యన్వయము. తనసేన విరాటరాజుయొక్క గోసమూహమును బట్టుకపోఁగాఁ దాను విరటునిఁ బట్టుకొనెననుట.
| వ. | అంత. | 30 |
| ఉత్సాహ. | సర్వపూజ్య యైనిజాజ్ఞ జరుగు నాతనిం జటా | 31 |
భారత. సర్వపూజ్య = సకలజనపూజ్యమైన, ఐనిజ = యమపుత్త్రుఁడైన ధర్మరాజుయొక్క, ఆజ్ఞ, అతనిన్ = విరటుని, జటాయుర్విఘాతి = జటాసురవైరియయిన భీముఁడు, యమ = నకులసహదేవులయొక్క, రణ = యుద్దముయొక్క, క్రియయందుఁ గల, ఉత్కతా= ఉత్సాహమే, సహాయముగాఁ గలవాఁడై, తత్ = ఆవిరటునియొక్క, విపక్ష = శత్రువులకు, మృత్యువైనవాఁడు, భీమునికి విశేషణము, ఆలము = యుద్ధమును, శుష్మ = పరాక్రమముచేత, “ద్రవిణం తరస్సహోబలశౌర్యాణి స్థామ శుష్మం చ” అని అ. దీపితముగఁజేసి, ఆతని విడిపించెనని క్రింది కన్వయము.