సంవత్సరము ముగిసెఁ గనుక విజృంభించి యుద్ధమందు శత్రుసంహారము చేసి రాజ్యము చేకొనవచ్చునని సంతోషపడె ననుట.
రామ. తత్ = ఆహనుమంతునియొక్క, సహః = బలిమివల్లనైన, “ద్రవిణం తరస్సహోబలశౌర్యాణి” అని అ. దర = భయముయొక్క, “దరో౽స్త్రియాం భయే శ్వభ్రే" అని అ. సంప్రవర్తనము = వృత్తాంతము, అప్పురములోను = లంకయందు, అగూఢమై, జరిగెను, అంత, దానవ = రాక్షసులయొక్క, రాజి = పంక్తులయొక్క, మోదకాలము = సంతోషకాలము, నేఁడు = ఈప్రొద్దు, ముగిసివచ్చెననుచు, వాతాత్మజుండు = హనుమంతుఁడు, సంతసమందెను = సకలరాక్షసులను నేఁడే సంహరించెద నని తలంచెను.
| సీ. | వ్యధఁ జేయుతత్సత్త్వవార్తాశ్రుతినిగ్లేశ | |
| తే. | ణాదతులితాంబునిధి మేఘనాదుఁ బనిచె | 29 |
రామ. తత్ = ఆహనుమంతునియొక్క, సత్త్వవార్తా = బలవృత్తాంతముయొక్క, శ్రుతిన్ = వినుటచేత, తత్సంగర = ఆహనుమంతునియుద్ధముయొక్క, భంగపరతన్ = చెఱుచుటకొఱ కనుట, ఉత్తమమైన, ద్రవిణసంపత్తి = బలసంపత్తికలవాఁడు, దుర్యోధనుఁడు = పోరశక్యము గానివాఁడు, పౌలస్త్యుండు = రావణుఁడు, తత్పురిలోపల, ధర్మజ = వింటివలనఁ బుట్టిన, భీమ = భయంకరములైన, సంక్రందనజయములు = ఇంద్రజయములయొక్క, ఆహవకృతి = యుద్ధక్రియయందు, సు = లెస్సైన, శర్మున్ = సుఖము గలవాని, అనాయాసముగ యుద్ధములు సేయువాని ననుట, బలముచేత, ఉపచిత = వృద్ధిఁ బొందింపఁబడిన, ధనుః ప్రణాదముచేతఁ దులితమైన, అంబునిధిన్ = సముద్రము గలవాని, మేఘనాదున్ = ఇంద్రజిత్తును, పనిచెను, అతఁడును = ఇంద్రజిత్తును, హరిన్ = హనుమంతుని, నుతమై, యుగ్రమునైన, ఆజిన్ = యుద్ధమందు, పట్టు