భారత. శక్తిమత్ = బలిమిగల, తదనుజసంఘము = కీచకు ననుజసమూహము, ఆక్షాంతమై = ఓర్పు లేనిదై, అతనికాంతకున్ = భీమునిస్త్రీ యైనద్రౌపదికి, కీడు చేసి, పవనపుత్త్రుభుజబలమునన్ = భీమునిబలముచేత, పొలిసెను.
రామ. శక్తి = బలిమిచేత, మత్త = మదించిన, దనుజ = రాక్షసులయొక్క, సంఘము = సమూహము, అంతమై = అక్షకుమారుఁడు కడగాఁగలదై, పవనపుత్త్రు = హనుమంతునియొక్క, భుజబలమునన్ = పరాక్రమముచేత, పొలిసెన్ = నొచ్చిపోయెను. అక్షకుమారసహితముగా నొచ్చెననుట, అంతక = యమునిసంబంధమైన, ఆగ్రహముయొక్క, ప్రేరణంబుచే = యమప్రేరణచేత, అతనికిన్ = ఆహనుమంతునికి, కీడొనర్చుకడఁకఁ జేసి = కీడు చేసెద ననుయత్నము నడపుటచేత, పొలిసె నని యన్వయము.
| తే. | విబుధకంటకకీచకవిపినమునకు | 27 |
రామ. విబుధకంటక = రాక్షసు లనెడి, కీచకవిపినమునకున్ = వెదురుటడవులకు, "వేణవః కీచకాస్తే స్యుర్యే స్వనంత్యనిలోద్దతాః” అని అ. దావవహ్నిగా వాయుజుఁడు ప్రతాపమహిమను నెఱపెను, బుధోత్కరంబు = దేవసమూహమును, “జ్ఞాతృ చాంద్రిసురా బుధాః” అని వై. అన్యులకున్ = శత్రువులైన రాక్షసులకు, ఎఱుకపడకుండ లోలోనఁ బొగడెను, రావణభీతులు గనుక.
భారత. విబుధకంటక = సజ్జనద్వేషులైన, కీచకులనెడి, విపినమునకున్ = అడవికి, దావాగ్నిభంగిని నాత్మప్రతాపమహిమను నెఱపెను, వాయుజుఁడు, అన్యు లెఱుఁగకుండ, లోలోన = రహస్యముగా, నెఱపెను, పొగడెను బుధోత్కరంబు.
| తే. | తత్సహోదరసంప్రవర్తనము జరిగె | 28 |
భారత. తత్సహోదర = ఆభీమునితోఁబుట్టులైన ధర్మరాజాదులయొక్కయు, సంప్రవర్తనము = నడక, అప్పురములోనన్ = విరాటపట్టణమందు, గూఢమై = ప్రచ్ఛన్నమై, జరిగెను = నడచెను, అంతను, ఏఁడు = అజ్ఞాతవాససంవత్సరము, ముగిసివచ్చెను, దానన్ = ఆముగియుటవలన, వర = శ్రేష్ఠమైన, ఆజి = యుద్ధముచేతనైన, మోదకాలము = సంతోషకాలము, అనుచు, వాతాత్మజుండు = భీముఁడు, సంతసమందెను, అజ్ఞాతవాస