భారత. తగదు, సంకేతితంబగు = వచ్చెదనని వానితోఁ జెప్పిన, సమయంబు = వేళ, తప్పకుండ, నీవు, తాల్మి సడలనీక = కోపము లేక, కోపము గలిగినను నారోషమున విజృంభించి పరాక్రమముఁ జూపి బయలుపడుదువు గనుక, నావెంబడిన్ = నావెంట, నడువవలయున్ = రావలెను.
| ఆ. | అని పలికి భవద్వరాత్మకు నామాట | 20 |
భారత. అని పలికి, భవత్ = నీయొక్క, వరమైనయాత్మకు, నామాట యొప్పగుటకున్ = నేఁ జెప్పినమాట సమ్మతి యగునందులకు, ఒక, గుఱుతొసఁగుమనియెన్ = అడయాలము నిమ్మనియెను, తత్ఫతి = ఆభీమునిచేత, ప్రహితమైన = ఇవ్వఁబడిన, నమ్మికయున్ = నమ్మకమును, కరంబు = మిక్కిలిని, సతికి = ద్రౌపదికి, ఉబ్బు = సంతోషమును, మెఱయఁగా, ఇచ్చెనని క్రిందటి కన్వయము, గుఱుతిమ్మని ద్రౌపది యడిగినను భీముఁ డిచ్చిననమ్మిక ద్రౌపదికి సంతోషము చేసెననుట.
రామ. అనిపలికి, భవద్వర = నీపతియైన రామునియొక్క, ఆత్మక = మనమునకు, నామాట = నేఁ జెప్పినమాట, ఒప్పగుటకున్ = నమ్మిక యగుటకు, ఒకగుఱుతు నొసఁగుమనియెను, తత్పతి = ఆసీతాపతిచేత, ప్రహితమైన = అంపఁబడిన, నమ్మిక = నమ్మకముకొఱకైన, ఉంగరంబు = ముద్రికను, సతికిన్ = సీతకు, ఇచ్చెను. అనియెను, ఇచ్చెను, అను రెండుక్రియలకును హనుమంతుఁడే కర్త.
| క. | అనిలజుఁ డధికతమస్థితి | 21 |
రామ. అనిలజుఁడు = హనుమంతుఁడు, అధికతమ = మిక్కిలినధికమైన, స్థితిన్ = మర్యాదచేత, “మర్యాదాధారణాస్థితీ" అని అ. ఒనరెడి, తమిన్ = వేడుకచేత, రామునియొక్క దుఃఖ ముడుపుటకు, తత్సతీ = ఆసీతయొక్క, శిరోమణిని గొని, చనఁగని = పోవువాఁడై, ఆమితమైన, దర్ప = గర్వముచేత, గురు = ఘనమైన, సంభ్రమము గలవాఁడై, అరిగెనని మీఁదటిపద్యమునఁ గ్రియ.
భారత. అనిలజుఁడు = భీముఁడు, అధికమైన, తమః = అంధకారముయొక్క, స్థితిన్ = నిలుకడచేత, తమిన్ = రాత్రియందు, “రజనీ యామినీ తమీ” అని అ. రామ = ద్రౌపది