రామ. వినుము, పలుక, పావని = పవనపుత్త్రుఁడైన హనుమంతుఁడు; ఆసతిన్ = ఆసీతను, బల్మిఁబట్టునొ యను శంక, తనయాత్మలోపల, అనుకొనెడుమాట.
| క. | తతభీమభుజబలంబున | 12 |
రామ. భీమ = భయంకరమైన, అను = అనెడి, మతినిఁ బూని, దమితమన్యుత్వరతన్ = అణఁపఁబడిన రోషాతిశయముగలవాఁడౌటచేత, మరల్చెన్ = ఆతలంపును ద్రిప్పుకొనియెను.
భారత. భీమ = భీమునియొక్క, భుజబలంబున, అనుమతిన్ = అంగీకారమును, పూని, మితమైన, మన్యుత్వరతన్ = కోపము గలదాననౌటచేత, మరల్చెదన్ = కీచకుని దిరుగనంపెదను, ఇప్పు డంగీకరించి భీమునిచేత సంహరింపించెద ననుట.
| క. | అనివార్యమాణరోషం | 13 |
భారత. అని = ఈలాగు ద్రౌపది మనస్సులో ననుకొని, వార్యమాణరోషంబునన్ = కోప మణఁచుచును, నవ = నూతనమైన, యుక్తిధార్ష్ట్యము = మాటలదిట్టతనము, తలిర్పఁగా, మనసిజవశున్ = మన్మధవశుఁడైనవాని, మగుడించి, అతనిచేఁతకు, అడలెన్ = విచారపడెను.
రామ. అనివార్యమాణ = నివారింపశక్యముగాని, రోషంబుచేత, అవనిజ = సీత, కడమ సరి. రావణునిఁ దిట్టిపొమ్మనె ననుట.
| ఆ. | సూపకారవృత్తి దీపింప మారుతి | 14 |
రామ. సు = లెస్సైన, ఉపకారవృత్తి = ఉపకారవర్తనము, దీపింపన్ = ప్రకాశించునట్టుగా, మారుతియున్ = హనుమంతుఁడును, నవమైన, అసమ = అధికమైన, ఆర్తిన్ = పీడచేత, "ఆర్తిః పీడాధనుఃకోట్యోః” అని అ. చెన్నుదొరుఁగు = ఖిన్నురాలైన, అగ్గుణాభిరామన్ = సీతను, తద్దర్శనము చేసి.