Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రతికెడు చందంబు భావింప వేవురు
            నాకీశు లైన గంధర్వవరులు
చర్చింప బహులక్షశతసంఖ్య లైనరా
            క్షసయక్షముఖు లెన్నికకు మిగిలిన
మన్నాథదోర్బలాభ్యున్నతి నడఁగక
            మించఁ జాలరు నిగ్రహించిరేనిఁ


తే.

దత్పరాక్రమ మిదె నీమదంబు నడఁప
నున్న యది నీకు మననాస యుండెనేని
శరణు చొరుము తదంఘ్రితామరసములకుఁ
దడయ కిపు డిట్లు కృత మైన తప్పు గావ.

8

రామ. ఓరి మూఢాత్మ, బ్రతికెడుచందంబు, భావింపన్ = విచారించుకొనుటకు, ఎఱుంగవని క్రిందటి కన్వయము. వేవురు = వేలసంఖ్యలైన, నాకీశులైనన్ = దేవేంద్రులైనఁగాని.

భారత. బ్రతికెడుచందంబు భావింపవు, నీవురు అయిదుగురు, నాకు, ఈశులైన గంధర్వవరులు, కడమ యేకార్ధము సులభము.

వ.

అనుమాటలు విని వాఁ డనాదరదుర్విలాసంబున వెడనవ్వు నివ్వ
టిల్ల నవ్వరవర్ణిం గనుంగొని.

9

రెంటికి సరి.

ఉ.

బేలవు గావె నీవు వెఱపించెదు వీరిని వారిఁబోలె న
న్నోలలితాంగి నాకు నిలనోపరు రుద్రముఖానిలామర
ల్సాలుఁ గుయుక్తు లిందులఁ దలంకఁ దలంకెదఁ గాని తావక
భ్రూలతికాధనుస్స్ఫురదపూర్వవిజృంభణ మన్మథోద్ధతిన్.

10

రెంటికిని సరి.

చ.

విను మిఁకఁ బెక్కు లేల యలివేణి నిజంబుగ నీకృపావలో
కన మిపు డబ్బకున్న రతికాంతునిచే నిమిషంబు నిల్వనో
ప నని రసోద్ధతిం బలుకఁ బావని యాసతి వాఁడు బల్మిఁ బ
ట్టునొ యనుశంక యప్పుడు గడుం బొడమం దనయాత్మలోపలన్.

11

భారత. వినుము, అలివేణి = ఓద్రౌపదీ! పలుకన్ = పలుకఁగా, పావని = పవిత్రురాలయిన, ఆసతి = ఆద్రౌపది, వాఁడు = కీచకుఁడు, బల్మిఁ బట్టునను శంక పొడమ, తనయాత్మలోపలను, ముందరిపద్యమున కన్వయము.