| | నవనిర్యన్మదనిర్ఘరౌఘమున శుండాశీకరోర్ధ్వప్రవ | |
అ-1. ప-11.
ఇందు శ్లేషోత్థాపితసంబంధాతిశయోక్యనుప్రాణితనిరుక్త్యలంకారము.
| క. | "ఉదుటున న ట్లరిగి యతం, డది ప్రాయశ్చిత్తతీర్థయాత్రాలీలన్ | |
ఆ-2. ప-91.
ఇం దర్థాంతరన్యాసాలంకారము.
| మత్తకోకిల. | “భూధరాధిపకన్యకామణిపుణ్యపాదపయోజలా | |
ఆ-3. ప-144.
ఇందుఁ బ్రథమసమాసమున ననుగుణాలంకారము.
ఇమహాకవి కావ్యగుణములుం బెక్కులు పొసఁగునట్లు రచన గావించెను. అన్నియు నిరూపించినం గ్రంథవిస్తరమగునని వానికిని రెండుమూఁడుదాహరణముల మాత్ర మిచ్చట నుదాహరించెదను.
| క. | “అది సకలసదాచారం, బది సర్వజ్ఞాన మది సమస్తజనిఫలం | |
ఆ-3. ప-60.
ఇందు శ్లేషాఖ్యగుణము.
| ఉ. | "అంత వసంత మొప్పెఁ జరమాగ్రిమభాగచరాఖిలర్తుసా | |
ఆ-2. ప-4.
ఇం దౌదార్య, ముదాత్తత, యోజస్సు, సౌకుమార్యంబు నూహ్యంబులు.
| సీ. | "అచ్చంపులేఁజిగురాకుజొంపముకెంపు, మేలిచెందిరపుఁగెంధూళి గాఁగ..." | |
ఆ-2. ప-5.
అనుసావయవరూపకానుప్రాణితవస్తూత్ప్రేక్షకు ముం దుదాహరింపఁబడిన పద్యమునందు సమత, యర్థవ్యక్తి, సమాధియు నూహ్యంబులు.