స్వరూపమైనవాఁడా, మధ్యేహృదబ్జ = హృత్పద్మమధ్యమందు, ఆరాధ్య = భజింపఁదగిన, అమల = స్వచ్ఛమైన, దివ్యమంగళ = దివ్యశుభస్వరూపమైన, నిజాంగ = నిజస్వరూపముయొక్క, అజస్రసాక్షాత్క్రియా = నిత్యసాక్షాత్కారముయొక్క, ధౌరంధర్య = వహించెడు చాతుర్యముచేత నైన, మహత్త్వ = మహిమకు, పాత్రిత = పాత్రముగాఁ జేయఁబడినవారై, గుణాధఃకారితా = త్రిగుణములను దిరస్కరించెడువా రౌటచేత, అష్టాంగయోగ = సాంఖ్యయోగమందుఁ గల, ఆరూఢి = అతిపరిచయముచేత, ప్రథమాన = ప్రసిద్ధులైన, మౌనిజన = మునీశ్వరులయొక్క, భాగ్యశ్రీ = అదృష్టాతిశయమును, సముజ్జృంభణా = ప్రకాశింపఁజేసెడువాఁడా!
| క. | ఆధునికసాధునికరస, మాధిదురారాధితామహత్తరవార్తా | 143 |
ఆధునిక = ఇప్పటివారైన, సాధు = సజ్జనులయొక్క, నికర = సమూహమునకు, సమాధి = యోగనిష్ఠచేతను, దురారాధితా = ఆరాధింప శక్యము గానివాఁ డౌట యనెడి, మహత్తరవార్తా = అధికతరమైన ప్రసంగములయొక్క, రోధార్థ = నిరాకరణనిమిత్తమై, విహిత = చేయఁబడిన, మచ్చిత్తాధిగమా = నాదుహృదయసంగతి గలవాఁడా! నావంటివానికిఁ బ్రసన్నమైనస్వామిని సకలమైనవారికినిఁ బ్రసన్నుండ వౌదువు గనుక నిన్ను నారాధింప శక్యము గాదను వాక్యము సిద్ధాంతము గాదు, అటు గనుకనే, పెద్దవేంకటాధిప = పెదవేంకటాద్రిచేత, సుగమా = లెస్సగాఁ దెలియఁబడినవాఁడా!
| మత్త. | భూధరాధిప కన్యకామణి పుణ్యపాదపయోజలా | 144 |
| గద్యము. | ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ పింగళియమర | |
భూధరాధిప = హిమవంతునియొక్క, కన్యకామణి = కుమారియైన పార్వతియొక్క, పుణ్య = పవిత్రములైన, పాదపయోజ = పాదపద్మములందున్న, లాక్షా = లత్తుకచేత, ఏధిత = వృద్ధిపొందఁబడిన, అరుణములైన, గైరికద్యుతి = జేగురులకాంతిగల, హేమకూటపర్వతమందగు, విహారలీలా = క్రీడావిలాసమందు, అధికాదర = మిక్కిలి నాదరము గలవాఁడా! సాధుసత్పురుషులచేత, సాధిత = వశముగాఁ జేసికొనఁబడినవాఁడా! హైమవతీ = గౌరి యొక్క, అనురంజన = ప్రేమపురస్సరముగా నడుగుకొనుటచేత