Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్రోలుటచేత, పాలితంబగుపురంబు = విరాటనగరమును, జనాంతరదుర్దమ = అన్యజనులకు భేదింపరాని, స్వతేజోవిభవములయొక్క, అభిగుప్తిమయిన్ = గోపనముచేత, చొచ్చి = ప్రవేశించి, మరుత్తునియొక్క నయమువంటి తయము గలవాఁడు, తత్ = ఆనగరముయొక్క, విభుండు, కడమ సులభము. ఆశ్రయించి రని ముందరిపద్యములోఁ గ్రియ.

రామ. ఆవనరాశిన్ = సముద్రమును, దాఁటి, విశ్వవిద్విషత్ - సకలలోకములకు శత్రువైన, రావణునిచేత, పాలితంబగుపురంబు = లంకను, మరుత్తనయుండు = హనుమంతుఁడు, చొచ్చి, కడమ సరి. ముందరిపద్యములతోఁ గుళకము.

సీ.

అతనిలీలాద్భుతరతిరాజనీతిశా
           స్త్రప్రసంగాదులు సలుపునెడలు
నభిమతభక్ష్యభోజ్యాదిపాకవిశేష
           చణసూదకర్మప్రసక్తియెడలు
శుద్ధాంతకన్యలసురుచిరనాట్యశి
           క్షణవినోదంబులు జరుపునెడలు
గాంధర్వగతిశిక్ష గావించునెడలు న
           త్యంతమాహారక్షణాదివిధులఁ


తే.

గ్రాలునెడలును గ్రమమునఁ గాంచి తత్త
దర్హగతి నాశ్రయించి రయంబు మీఱ
నవనిజాతను నైపుణీవివృతి మెఱసి
పరు లెఱుఁగకుండ నేగురు భవ్యధృతిని.

139

రామ. అతని = రావణునియొక్క, రతిరాజనీతిశాస్త్ర = శృంగారశాస్త్రములయొక్క, ప్రసంగాదులఁ జలఁపునెడలను, గాంధర్వగతి = సంగీతవిద్యయొక్క, శిక్ష = అభ్యాసమును, అత్యంతము, ఆహార, క్షణాది = ఉత్సవాది, తత్తదర్హమైన, గతిన్ = ప్రకారముచేత, కాంచి = చూచి, రయంబు మీఱ, అవనిజాతను = సీతను, ఆశ్రయించి = ఉద్దేశించి, పరు లెఱుఁగకుండనే, గురుభవ్యధృతిని, చరియించుచునని మీఁదిపద్యమున కన్వయము. కడమ సులభము.

భారత. ఆతని = ఆవిరాటునియొక్క, లీలాద్భుతమందైన, రతి = ప్రీతియొక్కయు, రాజనీతిశాస్త్రములయొక్కయు, ప్రసంగాదులను జలుపునెడలను, ధర్మరాజును, సూదకర్మ = పాకప్రయోజనముయొక్క, ప్రసక్తియెడలు = సమయములను, భీముఁడును, “సూదా ఔదనికా గుణాః” అని అ. నాట్యకశిక్షణవినోదంబులు జరుపునెడ