Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మరుదాత్మజముఖ్యులు ధ, ర్మరాజు దెస నరయువారు మగుడక యంతః
కరణములఁ బర్వుచింతా, భరములతోఁ జలిపి రగ్రపథగమనంబున్.

133

రామ. ధర్మరాజుదెసన్ = దక్షిణపుదిక్కునందు, అరయువారు = వెతకెడువారు, మరుదాత్మజముఖ్యులు = హనుమదాదులు, మగుడక =తిరుగక, కడమ సులభము.

భారత. ధర్మరాజుదెస నరయువారు = ఈయన యేగతిఁ బరునిఁ గొల్చెడినో యని విచారించుచు ననుట. మరుదాత్మజముఖ్యులు = భీమాదులు, మగుడక = ఉడుగక, పర్వుచింతాభరములతో.

క.

ఈతెఱఁగునఁ జనునంతటఁ, జేతోవీథి న్నిజార్థసిధ్యనుగుణసం
పాతిఖగోక్తులముద ము, ద్భూతంబుగ వింత లగువపురభిఖ్యలతోన్.

134

భారత. అర్థసిద్ధి కనుగుణ మౌనట్టుగా, సంపాతి = సంచరింపుచున్న, గమనముచేత, శకునము నిచ్చుచున్న వనుట. ఖగ = పక్షులయొక్క, కడమ సులభము.

రామ. సంపాతియనుపక్షియొక్క, అభిఖ్యలతోన్ = కాంతులతోడ.

వ.

ముందరికిం జనిచని.

135


క.

వారలు గనుఁగొని రతివి, స్తారాద్భుతమత్స్యరాజధానిని లవణాం
భోరాశిఁ గాళిమగుణో, దారతచే మించువనచయముగలదానిన్.

136

రామ. అతివిస్తారముచేత నద్భుతములయిన, మత్స్యరాజ = మీనశ్రేష్ఠములయిన తిమితిమింగిలాదులకు, ధానిన్ = స్థానమైనదాని, కాళిమగుణ = నైల్యగుణముయొక్క, ఉదారతచే, మించు = మించెడి, ననచయము = ఉదకసమూహము, కలదాని, లవణాంభోరాశిని గనుఁగొనిరి.

భారత. వారలు = ధర్మాదులు, విస్తారముచేత నద్భుతమైనదాని, కాళిమగుణోదారత్వముచేత, లవణాంభోరాశిని, మించు = జయించెడి, వనచయము = తోఁటలు, కలదాని, సముద్రమువలెనే నల్లనైయున్న తోఁపులుగల దాని మత్స్యరాజధానినిఁ గనుఁగొనిరి.

వ.

అంత.

137


ఉ.

ఆవనరాశి దాఁటి తగునట్టిక్రమంబున విశ్వవిద్విష
ద్రావణపాలితం బగుపురంబు జనాంతరదుర్దమస్వతే
జోవిభవాభిగుప్తిమయిఁ జొచ్చి మరుత్తనయుండు తద్విభుం
డేవెత లేక యుండఁ బ్రజనేలు తెఱంగున కాత్మ మెచ్చుచున్.

138

భారత. ఆ, వనరాశిన్ = వనసమూహమును, దాఁటి, తగునట్టి క్రమంబునన్ = వేషాంతరములచే ననుట, విశ్వవిద్విషత్ = సమస్తశత్రువులయొక్క, రావణ = పాఱఁ