Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రములు గలవా రౌటచేత - ఉపచారము గలవారై యనుట. రామభార్యన్ = సీతను, కానక, కాంతిభంగచణ = కాంతిహానిచేతఁ దెలియఁబడిన, “తేనవిత్తశ్చంచుప్చణపౌ” అని చణప్ప్రత్యయాంతము. తను = శరీరములయొక్క, లీలచేత, వివర్ణులై యనుట, చనిరని ముందరఁ గ్రియ.

భారత. అతిసత్త్వస్థ = అత్యంతసాత్త్వికగుణవర్తియైన, విరాట = విరాటరాజుచేత, వితత = విస్తరింపఁబడిన - పోషింపఁబడిన దనుట. నగర = మత్స్యపురమందు, చిత = సంపాదింపఁబడిన, ప్రచారతన్ = ప్రచారము గలవారౌటను, తత్పురనివాసము ననుట, మది కెక్క ధృతినరసి = అక్కడికిఁ బోవుదమని నిశ్చయించి యనుట. రామను = ఒప్పెడిదాని, భార్యను = ద్రౌపదిని, సతిన్ = పతివ్రతను, కానకకాంతి =కనకసంబంధమైన కాంతియొక్క, భంగచణ = జయించుటచేతఁ బ్రసిద్ధమైన, తనులీలన్ = దేహవిలాసము గలదాని, కనుఁగొని యని మీఁదటి కన్వయము.

క.

వనితామణి నురుశుభగుణఁ
గనుఁగొని దాస్యోచితవిధిగరిమము మిగులం
జనలేమ యకట యిఁకఁ దద
వనిపాలపురస్థితిం బ్రవర్తిలు టెట్టో.

130

భారత. వనితామణిని, శుభగుణకు, ద్రౌపదికి విశేషణములు. కనుఁగొని, దాస్యోచితవిధిన్ = దాస్యమునకుఁ దగిన వ్యాపారముచేత, గరిమము = గౌరవము, మిగులఁజనన్ = మిక్కిలిఁబోఁగా, లేమ = ఈద్రౌపది, తదవనిపాలపురస్థితిన్ = ఆరాజుపట్టణమున నుండుటచేత, ప్రవర్తిలు టెట్టో.

రామ. వనితామణిన్ = సీతను, కనుఁగొని, చనలేమ = పోలేముగదా, అంపినచోటఁ గార్యము చేసికొని పోవుట కొలిచెడువారి ధర్మము, తదవనిపాల = ఆరామసుగ్రీవులయొక్క, పురస్థితిన్ = ముందట నిలిచియుండుటచేత, ప్రవర్తిలు టెట్టో.

తే.

ఏము పనివార మనుచుఁ తద్భూమిపాలు
కడకు మన మేగువార మేకరణి నతని
యుల్లమున కెడయక ప్రవర్తిల్లనేర్తు
మనువిచారంబుచే నాకులాత్ము లగుచు.

131

రెంటికిని సరి.

వ.

పదంపడి తమతోఁచినయుత్తరంబులచే నొండొరులచింత డిందుపఱుచు
చుం దద్దిశాభిముఖు లై చని రప్పుడు.

132

రెంటికిని సరి.