నది యట్లుండెను. అపుడు = శరత్కాలమందు, నృపుని, ఉపరికృత్యంబునకున్ = రావణునిమీఁది దండయాత్రకు, తపనసుతుఁడు = సుగ్రీవుఁడు, అనిపెనని ముందరిపద్యములోఁ గ్రియ.
| క. | అజ్ఞాతవాసమహితన, యాజ్ఞాపనరామభాషణార్పితకార్య | 127 |
రామ. అజ్ఞాతవాస = తెలియఁబడని యునికిగల, మహితనయా = సీతాదేవికి, జ్ఞాపన = గుఱుతులు చెప్పెడి, రామభాషణములచేత, ఆర్చిత = పెట్టఁబడిన, కార్యప్రజ్ఞలు గలవానిఁ జేసి, రామునిచేతఁ జెప్పింపవలసినగుఱుతులు చెప్పించి యనుట. నిజాజ్ఞాకరణమే, ఏకశరణ = ముఖ్యాధారముగఁ గలవారిని, తనకు నధీనమైనవారి ననుట. అనిపెను.
భారత. అజ్ఞాతవాసమందలి మహితమైన, నయ = నీతియొక్క, ఆజ్ఞాపన = ఉపదేశించుటచేత, రామ = మనోహరములైన, భాషణములచేత, అర్పితమైన కార్యప్రజ్ఞలు గలవానిఁ జేసి - అందుకుఁ దగిననీతి చెప్పి వరమిచ్చి యనుట. వారిన్ = ఆపాండవులను, అనిపెను.
| ఆ. | అపుడు వారు మహిజనావిదితస్థితిఁ | 128 |
భారత. మహిజనులచేత, అవిదిత = తెలియఁబడని, స్థితిన్ = అజ్ఞాతవాసమును, చేయుటకు, తత్ = ఆయమునియొక్క, ఉక్తిఁ జేకొని, వివిధదిక్పురముల నుల్లముల వెదకి చూచి = ఏపట్టణమునకుఁ బోదమని యెంచుకొని యనుట. మీఁదటిపద్యముతోఁ గుళకము.
రామ. మహిజను = సీతను, అవిదితస్థితిన్ = మిక్కిలిఁ దెలియఁబడ్డ స్థితిగలదానిఁగా, చేయుటకు, సీతయున్నదిక్కు తెలియుటకొఱ కనుట. తత్ = ఆరామునియొక్క, ఉక్తిఁ జేకొని, వివిధదిక్పురములన్ = అన్నిదిక్కులపట్టణములయందును, వెదకి చూచి.
| క. | అతిసత్త్వస్థవిరాటవి, తతనగరచితప్రచారతను మది కెక్కన్ | 129 |
రామ. అతిసత్త్వ = మిక్కి_లి జంతువులుగల, స్థవిరాటవి = జీర్ణారణ్యములచేత, తత = వ్యాపింపఁబడిన, నగ = పర్వతములయందు, రచిత = చేయఁబడిన, ప్రచారతన్ = ప్రచా