| తే. | విరహితాపకారంబు తద్విభవ మతను | 126 |
భారత. విప్ర = బ్రాహ్మణునియొక్క, కార్యమును, కానివెతఁ జేసి, కాండ = బాణములయొక్క, వర్ష = వర్షించుటవల్లనైన, శ్రమమునన్ = బడలికచేత, కలఁకన్ = ఆకులత్వమున, నీరాని = నీళ్లు దాగి, తమ్ములు = భీమాదులు, కాల = యమునియొక్క, మహిమచేత, పొలియన్ = నొచ్చిపోఁగా, వారిన్ = ఆతమ్ములను, గురుప్రసాదంబు = తమతండ్రి యైనయమునియొక్క యనుగ్రహమును, తనయొక్క, ఉక్తిసామర్థ్యఘనతచేత = ఆయనప్రశ్నములకుఁ దా నుత్తరములు చెప్పి యనుట, పడసి = పొంది, దిత = ఖండింపఁబడిన, కామ = కోరికలయొక్క, అళి = సమూహముకలవాఁడు, యోగిసముఁ డనుట, ఆగుణఘనతనుండు = ధర్మజుఁడు, మనిపెనని క్రిందటికన్వయము. ఇది గాక కవివాక్యము, విరహితమైనయపకారము గలది - ఎవ్వరికిని గీడు సేయనిదనుట, అజాతశత్రుఁడు గనుక, తద్విభవము = ఆధర్మరాజు ప్రభావము, అతను = అనల్పమైన, వికసనమున్ = విలాసమును, ఎవ్వరిమనంబునకు నొనర్పదు - అందఱిమనమున కాహ్లాదము చేయుననుట, నృపుని = ధర్మరాజుయొక్క, ఉపరికృత్యంబునకున్ = అజ్ఞాతవాసాదికృత్యములకు, తగన్ = ఉచితమౌనట్లుగా, తపనసుతుఁడు = యముఁడు, అనిపెనని ముందటిపద్యములోఁ గ్రియ.
రామ. విప్రకార్యముగాని = మానుప శక్యముగాని, వెతఁజేసి, కరము = మిక్కిలి, దుస్సహమైన, కాండవర్షశ్రమమునన్ = ఉదకవృష్టిచేత యలమటచేత, అదటేది = బిరుదుచెడి, కలఁకనీరు = కలఁగినయుదకమును, ఆని = పొంది, తమ్ములు = పద్మములు, ఘనకాల = వర్షాకాలముయొక్క, మహిమచేత, నోలిని, పొలియన్ = అణఁగిపోఁగా, వర్షాకాలమందుఁ బద్మముల ప్రకాశము చెడుఁ గనుక, వారి = ఉదకముయొక్క, గురుప్రసాదంబు = లెస్సగాఁ దేఱుటను, తనయొక్క, యుక్తిసామర్థ్య = సంసర్గసామర్థ్యముయొక్క, ఘనతచేతఁ జాలంగఁబడసి, శరత్సంసర్గము గలిగెనే నుదకము తేఱును గనుక, తత్సమయంబు = ఆశరత్కాలము, నందితకామాళి = సంతోషింపఁజేయఁబడిన, మన్మథుఁడు దుమ్మెదలును గలది, శరద్విశేషణము. పద్మములను నిట్టిశరదృతువు మగుడంగ మనిపెనని క్రిందటి కన్వయము. ఇట్టి పద్మపోషణముచేత మన్మథుఁడు దుమ్మెదలను మెఱయించెననుట, గుణఘనతను = గుణాధిక్యమునను, ఉండు = ఉండెడిది, విరహితాపకారంబు = విరహులకుఁ దాపము చేసెడిది, తత్ = ఆశరదృతువుయొక్క, విభవము, అతనువికసనమున్ = మన్మథునివికాసమునను, ఎవ్వరిమనంబునకు నొనర్పదు = అరయఁగ