Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నీలీ ఝింటీ ద్వయోర్బాణా” అని అ. ఆసన = వేగిమ్రాఁకులయొక్కయు, “సర్జకాసన బంధూకపుష్పప్రియకజీవకాః" అని అ. శర = రెల్లుయొక్కయు, “గుద్రస్తేజ నకశ్శరః" అని అ. ప్రపంచంబు మహిమ, విస్ఫూర్తిచేతఁ బరఁగంగ, తవిలి = లగ్నమై, వెంబడిని, అలసిరి = ఆకాంతి, మివులు వర్తిల్లెను, చంద్రాదులయందును మిగుల లక్ష్మి కలిగి యుండెననుట. తత్ =ఆ, శరదవసర = శరత్కాలమందున్న, భసలీ = భృంగస్త్రీ లనెడి, "బంభరశ్చ మిళిందశ్చ హిందోళభసలౌ సమా" అని హలాయుధము. లసత్ = ఒప్పుచున్న, కృష్ణ = నీలవర్ణములైన, సారరత్న = శ్రేష్ఠరత్నములయొక్క, అలఘుమహిమకు, తృణకణాయమానమై = హరింపఁబడ్డదియై యనుట, నీలాలు తృణగ్రాహులు గనుక, మానసంబు చలింపంగ, నృపుఁడు = రాముఁడు, నివ్వెఱపడియెను, విరహి గనుక.

భారత. శృంగ = కొమ్ములయొక్క, లీలా = క్రియచేత - రాచుకొనుటచేత ననుట, సముత్ = బ్రాహణునియొక్క సంతోషముతోఁ గూడునట్టుగా, కృష్ణ = హరింపఁబడిన, మహత్ = అధికమైన, అరణితా = అరణి గలవాఁడౌటచేత, ఖిన్నుఁడైన, సార = శ్రేష్ఠుఁడైన, సద్ద్విజునిచేతఁ బ్రార్థితమైన, వ్యవస్థావనంబై = నిలుపుట గలదై, భావము = కొమ్మున నరణిఁ దగిలించుకపోయెడి హరిణమును నిలుపుటకు బ్రాహ్మణుఁడు ప్రార్థించె ననుట, ఆహరిణము, తిరంబగు పొలుపున విలసిల్లుచున్న, రాజు = ధర్మరాజును, తమ్ములు = భీమాదులును, అతులితమైన యుత్కర్షచేత, శాలి = ఒప్పుచున్న, బాణాసన = విండ్లయొక్కయు, శర = బాణములయొక్కయు, ప్రపంచంబు వ్యాపారము, విస్ఫూర్తిఁ బరఁగంగ, తవిలి = వెంటఁదగిలి, అలసిరి, తత్ = ఆపాండవులయొక్క, శరదవ = దావాగ్నివంటి బాణములయొక్క, ఉపమానోత్తరపదము, సరభసలీల = శీఘ్రవ్యాపారము, సత్ = లెస్సైన, కృష్ణసారరత్న = మృగశ్రేష్ఠముయొక్క, “రత్నం స్వజాతిశ్రేష్ఠే౽పి” అని అ. అలఘుమహిమలు, తృణకణాయమానమై = తృణప్రాయమై, మివుల వర్తిల్లెనని క్రిందటి కన్వయము. నృపుఁడు = ధర్మరాజు, నివ్వెఱపడియెను.

సీ.

విప్రకార్యము గాని వెతఁ జేసి కరము దు
           స్సహ మైనకాండవర్షశ్రమమున
నదటేది కలఁకనీరాని తమ్ములు ఘన
           కాలమహిమచేసి నోలిఁ బొలియ
మగుడంగ మనిపె వారిగురుప్రసాదంబు
           దనయుక్తిసామర్థ్యఘనతచేతఁ
జాలంగఁ బడసి తత్సమయంబునందిత
           కామాళి యాగుణఘనతనుండు