ఉపోద్ఘాతము
ఇమ్మహాకావ్యమును నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వచాతుర్యధుర్యుం డైనపింగలి సూరనార్యుఁడు రచియించెను. ఈమహాకవి నియోగిబ్రాహ్మణుఁడు. యాజుషశాఖాధ్యయనపరుఁడు, గౌతమగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. అమరనార్యునకును అబ్బమ్మకును బుత్త్రుఁడు. సూరనార్యునకుఁ బౌత్త్రుఁడు. భావనామాత్యునకు దౌహిత్రుఁడు. ఇతనికిఁ దమ్ము లమలన యెఱ్ఱన యనువార లిరువురు గలరు. ఈయర్థము రాఘవపాండవీయకళాపూర్ణోదయములలోని
| సీ. | "శోభితాపస్తంబసూత్రు గౌతమగోత్రు సుచరిత్రుఁ బింగలి సూరసుకవి | |
ఆ 1. ప 9.
అనుపద్యపుసీసపాదములను బ్రభావతీప్రద్యుమ్నములోని
| క. | “గౌతమగోత్రునకును బ్ర, ఖ్యాతాపస్తంబసూత్రయాజుషశాఖా | |
అనుపద్యమునను స్పష్టమయ్యెడు.
ఈవంశమువారికిఁ బింగలి యనుగ్రామమున నివసించిన కారణమునఁ బింగలివా రనిపేరు వచ్చినట్లు ప్రభావతీప్రద్యుమ్నములోని
| మ. | "తరముల్ నాల్గయి దెందు నెందునగుఁ దత్తద్గ్రామనామంబులం | |
అనుపద్యమువలనం దెలియవచ్చెడు. పింగలి యనుగ్రామము కృష్ణా