భారత. నిర్ణిరోధ = అవరోధము లేని, దిశాపతితా = దిక్పతిత్వముచేత, అభినుతుఁ డయిన, భానుసంతతి = యముఁడు, హరిణభావము = లేఁడిరూపముయొక్క, కైపు వడసి, ఎలయించెన్ = బ్రాహ్మణుని మోసము పుచ్చెను.
రామ. ఇంక మూఁడుపద్యములు శరత్కాలవర్ణనము. నిర్ణీరోధ= అవిచ్ఛిన్నముగా, దిశా = దిక్కులయందు, పతిత = వ్యాపించిన, అభినుత = స్తుతింపఁబడిన, భానుసంతతి = కిరణసమూహము, “భానూ రశ్మిదివాకరా” అని అ. చోద్యంబై పరఁగఁగా, హరిణభావము = ధావళ్యముయొక్క, 'హరిణః పాండురః పాండుః' అని అ. కైపు = విలాసమును, పడసి, వింతగతిచేత, నెల = చంద్రుఁడు, ఇంచెన్ = ఇంపాయెను.
| సీ. | భాసురశృంగలీలాసముత్కృష్టమ | |
| తే. | మివుల వర్తిల్లెఁ దచ్ఛరదవసరభస | 125 |
రామ. భాసుర = ఒప్పుచున్న, శృంగ = ప్రాధాన్యముయొక్క, "శృంగం ప్రాధాన్య సాన్వోశ్చ" అని అ. లీలా = విలాసముచేత, సముత్కృష్ట = మిక్కిలి నుత్కృష్టములయిన, మహారణిత = అధికస్వరముగల, అఖిన్న = సంతోషపడుచున్న, సారసద్విజ = బెగ్గురు లనెడు పక్షులయొక్క, "పుష్కరాహ్వస్తు సారసః దంతవిప్రాండజా ద్విజాః" అని అ. ప్రార్థిత = కోరఁబడిన, వ్యవస్థాపనంబై = నిలుపుట గలదై, ఫలితార్థము. ప్రాధాన్యముచేత మోయుచున్న సారసపక్షు లింకను నీశరత్కాల మొప్పుచునుండవలెనని కోరెననుట, కడు, హరిణ = శుభ్రమైన, ముదిరంబు = మేఘము, “ఘనజీమూతముదిరజలముగ్ధూమయోనయః" అని అ. అగుపొలుపునన్ = ఆవుచున్న యొప్పిదముచేత, విలసిల్లుచున్న, ఆవేళయందున్ = శరత్కాలమందు, రాజు = చంద్రుఁడును, “రాజా ప్రభౌ నృపే చంద్రే ” అని వి. తమ్ములును = పద్మములును, అతులితోత్కర్షముగల, శాలి = రాజనముయొక్కయు, "శాలయః కలమాద్యాశ్చ" అని అ. బాణా = రంటయొక్కయు,