| | పనుపునఁ గ్రమ్మఱఁ దనకీశబల మెందుఁ | |
| తే. | రంజిలుచు రామకార్యవర్తనకుఁ దగిన | 122 |
రామ. అకలుష, ఆత్మ = తనయొక్క, ప్రమద = సంతోషముయొక్క, ఆప్తిని, వాలితమ్ముఁడు = సుగ్రీవుఁడు, ఆసింధుభూధవకుమారు = చతురుదధివేష్టితభూపతియైన రాముని, సఖ్య = స్నేహముయొక్క, అతిబలముపసను, అన్న వాలియొక్క, అహీనములైన, దర్పము నధికత్వమును, మనుజాధినాథు = రామునిచేత, సమ్యక్ప్రయుక్త = లెస్సగాఁ బ్రయోగింపఁబడిన, విశిఖత్వమునన్ = బాణము గలవాఁ డౌటచేత, విశిఖసమ్యక్ప్రయోగముచేత ననుట, భంగించి = రామునిబాణముచే వాలిని జంపించి యనుట, కీశబలము = వానరసేన, “మర్కటో వానరః కీశః" అని అ. రామ = రఘుపతియొక్క, కార్యవర్తనకుఁ దగినయట్టిమాటలన్ = దండెత్తిపోయి సీతను హరించినవాని సంహరింత మనెడుమాటలచేత, అంత, ఉరువన = అధికజలమునకు - వృష్టికి ననుట, వాస = నివాసమైన, కాలముయొక్క, అంతము = శరత్కాలము, అగుడున్ = అవుటవలన, కడమ సులభము.
భారత. అకలుషా = పతివ్రతయైన, ఆత్మప్రమదా = ద్రౌపదియొక్క, ఆప్తిన్ = ప్రాప్తిచేత, విడిపించుకొనుటచేత ననుట, వాలి = మీఱి, తమ్ముఁడు = భీముఁడు, ఆసింధుభూధవకుమారున్ = సైంధవుని, సఖ్యాతితోఁ గూడిన, బలముపసను, నయహీనమైన దర్పముచేత నధికమైన, తలున్ = స్వరూపముగలవాని, "అధస్స్వరూపయోరస్త్రీ తల” మ్మని అ. మనుజాధినాథున్ = సైంధవుని, సమ్యక్ప్రయుక్తవిశిఖత్వంబునన్ = శిఖారహితత్వముచేత, భంగించి శిఖ గోసి యనుట, తనపనుపున, క్రమ్మఱన్ = తిరిగిరాఁగా, తనకు, ఈశబలము = ఈశ్వరానుగ్రహ మనుట, ఆర్యవర్తనకున్ = సద్వర్తన గలదానికి, రామకున్ = ద్రౌపదికి, తగినయట్టి మాటల చేత, ఆహ్లాదమాచరించెన్ = చెఱఁబోయె ననువిచారమును మాన్పె ననుట, వనవాసకాలముయొక్క, అంతమగుడున్ = సమాప్తి యగుటచేత, ఉపరికృత్యంబునకున్ = అజ్ఞాతవాసమునకు, మహోద్యోగుఁ డయ్యెను.
| వ. | అప్పుడు. | 123 |
| క. | చూపట్టి నిర్ణిరోధది, శాపతితాభినుతభానుసంతతిచోద్యం | 124 |