Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత్రమున జీప్పువికల్పము గనుకఁ దన్వి యన్నట్టు తనుశబ్దమును స్త్రీవాచకముగాఁ బ్రయోగించినాఁడు. ఇందుకుఁ బ్రయోగము నలోదయమందు, “తనుచ్చటోత్తమాలయా తయాభవోత్తమాలయా, అహాని శీతమాలయా, యనిలావధూతమాలయా” అనుశ్లోకమునందుఁ దనుచ్చటశబ్దము స్త్రీసమూహమని వ్యాఖ్యానమందుఁ జెప్పినది.

రామ. అసమాస్త్రశిఖిన్ = అధికమైన బాణాగ్నిని, ఆర్చి, తన్ను, మనుచునాథులులేమిన్ = రక్షించెడివారు లేకుండుటచేత, సాధ్వసమ్ము = భయము, "భీతిర్భీస్సాధ్వసంభయ” మ్మని అ. అతివికృతోక్తిన్ = అధికదైన్యవికృతోక్తిచేత, మమ్మరముగన్ = మించి కానరాఁగా ననుట, శరణాగతుండయి, తద్రామ = ఆరామునియొక్క, ఘనమైన, ఘృణా = దయ యనెడి, "ఘృణా జుగుప్సాకృపయోః" అని వి. అర్ణవమున, మునుఁగఁ = మునుఁగుటవలన, రాముఁడు దయదలఁచఁగా ననుట, ఆత్మీయతనువున్ = తనశరీరమును, మగుడఁ గొనిపోయెను. నాన్ = అనఁగా, వింటిని, భీముఁడైన = భయంకరుఁడైన, బలభేదిసుతుఁ డైనన్ = వాలి యైనఁగాని, రాజన్యవరుఁడు = రాముఁడు, యాత్ర = జయయాత్రను, చలుపునపుడు, అనికడంకన్ = యుద్ధసన్నాహమును, త్రిప్పఁగలఁడే యని యన్వయము.

క.

అనివారితవ్యథాసం, జననం బగురామవార్త స్వజనము చెప్పన్
విని సంభ్రమ మొదవఁగఁ జ, య్యన నాసుగ్రీవకపి హితాధికచింతన్.

121

రామ. అని = ఇట్లని, వారిత = వారింపఁబడిన, వ్యధా = విచారముయొక్క, సంజన = పుట్టువుగల, రామవార్త = రఘుపతివృత్తాంతమును, స్వజనము = హనుమంతుఁడు, చెప్పగా విని, సుగ్రీవకపి, హితాధికచింతను, అరిగి యని ముందటి కన్వయము.

భారత. అనివారిత, రామవార్త = ద్రౌపదివృత్తాంతమును, ఆసుగ్రీవకున్ = మంచికంఠము గలద్రౌపదికి, అపిహిత = ప్రకటమైన, అధికిన్ = మనోవ్యధ గలదానికి, "పుంస్యాధిర్మానసీ వ్యధా" అని అ. అచింతన్ = సంతోషముచేత, ఎంచుచునని ముందటి కన్వయము.

సీ.

శుభమగుచంద మెంచుచు మంగళావహ
           స్వనపత్రరథగతిసౌష్ఠవమునఁ
జిత్తంబు రంజిల్ల శీఘ్రయానంబున
           నరిగి యానృపునిఁ బ్రహర్ష మొప్పఁ
గని యఫ్టు భీమవిక్రమశక్రసుతదర్ప
           యమనవరణనిష్ఠసమధిక మగు
తద్బలవిభవంబు తాఁ జూడఁగా మించి
           వర్తిల్ల మానవేశ్వరవరుండు