తత్ = ఆపాండవులయొక్క, భార్య = ద్రౌపదిని, కోరి = కామించి, ద్రౌపదితో ననెడుమాట, ఘనమనోవిభ్రాంతి గాక, వయస్సుయొక్కయు, రూప = సౌందర్యముయొక్కయు, ధారణంబున మించుదానవు, ఉండుదానవా = ఉండగలవా, నిమిష = క్షణమేని, అవార్యతన్ = వారింప శక్యముగాని దౌటచేత, మహాశున్ = అధికశోకమనెడి, అనలసంబంధమైనజ్వాల వెనుకొనఁగా, అటవిని, వర్తనకున్ = జీవనమునకు, ఒండుగతి లేక వందురుచును, ఉండుదానవా యని క్రిందటి కన్వయము, కావునన్ = అటుగనుక, రామ - ద్రౌపదికి-సంబుద్ధి, కరుణను; ననుచు = అంకురింపఁజేయుమా, ముందటిపద్యములోఁ గుళకము.
| సీ. | అసమాస్త్రశిఖినిదయావృష్టి నార్చి హృ | |
| ఆ. | గలఁడె భీముఁ డైన బలభేదిసుతుఁ డైన | 120 |
భారత. అసమాస్త్ర = మన్మథుఁడనెడి, శిఖిన్ = అగ్నిని, దయావృష్టిచేత నార్చి తన్నుము, అనుచు, పాదప్రహారము శృంగారచేష్ట యైనందుకు, “సాలక్తకేన నవపల్లవకోమలేన పాదేన నూపురవతా మణిసింజితేన, య స్తాడయతే దయితయా ప్రణయాపరాధాత్సోంగీకృతో భగవతా మకరధ్వజేన” అని యమరుకశ్లోకము, సాధు = సత్పురుషులకు, అసమ్మతి = సమ్మతిరహితమైన, శరణాగతుండయి = ఇల్లుచొచ్చినవాఁడై, "శరణం గృహరక్షిత్రోః” అని అ. తద్రామన్ = ఆద్రౌపదిని, మృణార్ణవమునన్ = జుగుప్పాసముద్రమందు, మునుఁగన్ = మునుఁగుచుండఁగా, పట్టికొనిపోయెను, అప్పుడు సైంధవుఁ డనుకొనెడుమాట, నావింటిబల్మిని, పరిభవించి = అణఁచి, భీముఁ డైనను, బలభేదిసుతుఁ డైనన్ = అర్జునుఁ డైనను, ఇతరుఁ డైనవీరుఁ డెవ్వఁ డైన = ధర్మజనకులసహదేవులలో నెవ్వరైనఁగాని, ఆత్మీయతనువు = నిజస్త్రీని, త్రిప్పఁగలఁడె యని యాత్ర సలుపునపుడు, ముందటిపద్యములతోఁ గుళకము, "బహ్వాదిభ్యశ్చ" అను