రామ. మును, తత్పార్థివు = రామునియొక్క, మనకార్యప్రస్తుతత్వంబు = ప్రయోజన్మప్రసక్తి, అల్పమో.
| తే. | అని యనుపమానదోర్బల ఘనతఁ జేసి | 117 |
రామ. అనుపమాన = సరిలేని, దోర్బలఘనతచేత, అని = యుద్ధమును, చేసి, ఆదిత్యకులరాజసూనుఁడు = రాముఁడు, సయిదోడు = లక్ష్మణునియొక్క, కడమ సులభము.
భారత. అని = ఇటని, అనుపన్ = అంపఁగా, మాన = ధైర్యముయొక్కయు, "మానశ్చిత్తసమున్నతిః” అని అ. దోర్బల = భుజములయొక్కయు, ఘనతఁ జేసి, విడిపింపనోపు = విడిపింప సమర్థుఁడైన, ఆదిత్యకులరాజసూనుఁడు = అర్జునుఁడు, సయిదోడు = భీమునియొక్క, ప్రాపు తనరఁగా, విడిపించెనని రెండర్థములకు మీఁదటిపద్యమునఁ గ్రియ.
| శా. | దుర్వారస్వచమూఘనధ్వజమరుద్ధూతాభ్రతిగ్మాంశుగం | 118 |
భారత. దుర్వారమైన, స్వచమూ = తనసేనయందున్న, ఘనధ్వజములయొక్క, మరుత్ = వాయువుచేత, ధూత = చలింపఁజేయఁబడిన, అభ్రమందున్న, తిగ్మాంశున్ = సూర్యుఁడుగలవాని, ఆయనసేనవల్ల సూర్యునికిని గగనమందు నిల్వరాదనుట, ఖరునిన్ = క్రూరుని, చిత్రసేనుఁడను గంధర్వుని, దండించి = శిక్షించి, హృదయమందలి గర్వముచేత, అసాధు = చెడ్డవాఁడైన, సుయోధనున్ = దుర్యోధనుని, సకళత్రసోదర = పెండ్లాము తమ్ములతోఁగూడ, పరిప్రాప్త = పొందఁబడిన, వ్యధాసంగమును, విడ్పించెన్ = పోఁగొట్టెను.
రామ. తిగ్మాంశుగంధర్వున్ = సూర్యునిగుఱ్ఱములవంటి గుఱ్ఱాలు గలవాని, చిత్రసేనున్ = చిత్రము లైనసేనలు గలవాని, ఖరునిన్ = ఖరుఁడను రాక్షసుని, దండించి = సంహరించి, హృద్గర్వముచేత, అసాధు = ధూర్తులయిన, సుయోధ = సద్భటులను, నుత్ = విరియఁగొట్టెడి, “నుద ప్రేరణే” అను ధాతువునఁ గృదంతము. నిజభుజౌద్ధత్యములయొక్క, ప్రథల్ = ప్రసిద్ధములు, పర్వంగా, సకళ = సమస్తమైన, లళలకభేదము, త్రస = ప్రాణములయొక్క, "త్రసలింగం చరాచరే” అని అ. ఉదర = కడుపులయందున్న, వ్యధయొక్క సంగమును విడ్పించెనని క్రిందటి కన్వయము. ఖరునిఁ జంపి చరించెడి జం