| | ర్తనభృశఖిన్ను నన్నుఁ గడు రంజిలఁ జేసె నితండు వచ్చి యి | 112 |
రామ. తనయొక్క, రుమాధవు = సుగ్రీవునియొక్కయు, మైత్రికి, ఈహనుమంతునియొక్క, ఆర్య = శ్రేష్ఠమైన, తత్ = ఆహనుమంతునితోడి బంధుత్వమందుఁ గల.
భారత. తనరు = ఒప్పెడి, మాధవు = కృష్ణునియొక్క, వీడ్కొలిపి, కృష్ణుని నంపి, ఈహన్ = కోరికచేత, ఇతండు, మంతు = అపరాధముచేత, ఘనమైన, అరి = శత్రువైన దుర్యోధనునియొక్క, అధర్మవర్తనచేత, భృశ = మిక్కిలియు, ఖిన్నుఁడైనవాని, రంజిలఁజేసె, అనుఁగుఁదనంబు = బంధుత్వమును, అంచు, తత్ = ఆకృష్ణునియందుఁగల, ఉత్సుకతన్ = వేడుకచేత, ప్రవర్తిలెను.
| తే. | అంతటను భవ్యనవ్యసఖ్యప్రకటన | 113 |
భారత. అంతట, దుర్యోధనుండని మీఁదటి పద్యములోనున్నది కర్త, వాలి = మీఱి, తమ్ముఁడు, దుశ్శాసనుఁడు, సులభము.
రామ. అంతట, వాలితమ్ముఁడు, సుగ్రీవుఁడు, భవ్య = కాఁగల, నవ్య = నూతనమైన, సఖ్య = రామసఖ్యముయొక్క, ప్రకటన = తెలుపుట చేత, భృశ = మిక్కిలి, సుఖిత = సుఖింపఁజేయఁబడిన, కర్ణములుగల - విననింపైన వనుట, శకునివాక్ = పక్షివాక్కులయందు, వశగుఁ డగుచున్ = ప్రసంగపరుఁడై, ప్రధాన = ప్రధానులతోడ నగు, మంత్రస్థితి = ఊహాపోహణలను, నడపుచుండ, తెలిపెనని మీఁదటిపద్యమునఁ గ్రియ.
| సీ. | ఎలమిఁ బొంగుచు మహాబలసంతతిసమగ్ర | |
| తే. | దారుణార్తి చెందుటయు నా ధర్మసూతి | |