ఇందు సావయవరూపకానుప్రాణితవస్తూత్ప్రేక్ష సహృదయహృదయంగమంబై తనర్చెడు. మఱియు నీపద్యమున సీసపాదములు నాలిగింటిలో సంయుక్తచకారప్రాసంబును, బాదార్ధావసానంబున నేకరీతిగా బూర్ణానుస్వారపూర్వకముగాఁ బకారోత్తర ముకారము నిలుపుటయుఁ బాదావసానంబున నన్నిఁటిలో నొక్కరీతిగాఁ “గాఁగ” ననుపదమే కూర్చుటయు, దానికి ముందు దీర్ఘముమీఁద “ళి” యను దానిని నిలుపుటయు నియతము గావించి శబ్దాలంకారమును గూర్చుటం జేసి వినువారికి వీనులవిందు గొల్పెడు.
| సీ. | “నానాఁటి కుప్పొంగునవకంపుఁగళల పెం, పునఁ జిన్నిక్రొన్నెలబోద లనఁగ | |
| తే. | "వెలసి రిలను ధర్మజభీమవిజయు లనఁగఁ | |
ఆ-2. ప-3.
ఇం దుల్లేఖాలంకారము చమత్కారంబుఁ గూర్చెడు.
| మ. | “ఇటుము న్నుర్వరఁ బర్వుచున్నవిజయోదీర్ణప్రతాపాద్భుతో | |
ఆ-4. ప-109.
ఇందుఁ జతుర్ధపాదమునం గారణప్రసక్తిమాత్రమునం గార్యోత్పత్తిలక్షణంబుగా నొదవు చపలాతిశయోక్త్యలంకారము ప్రతిపాదింపఁబడియె.
| శా. | "శ్రీతోఁ బుట్టి సుధామధుద్రవముతోఁ జెన్నొందుపుష్పంబు శో | |
ఆ-1. ప-1.
ఇందు భంగ్యంతరాశ్రయవచఃప్రతిపాదనలక్షణం బైన పర్యాయోక్తాలంకారము నిరూపింపఁబడియె.