వాక్యసరణిని, సకలకానన = సమస్తాటవులయందున్న, ఉగ్రజంతు = సింహాదిమృగములను, త్రాస = వెఱపించెడి, యోజనాయతదోః = దీర్ఘబాహులయొక్క ప్రభావముచేత భీమాంగుఁ డైన కబంధునియొక్క మర్దనచేత నతిదీప్తమైన బలాధిక్యము గలవాఁ డగుచు, నున్న = పోమొత్తఁబడిన, దారుణమైన యహితమైన యద్భుతదేహముగలవానిన్ = రాక్షసదేహము గలవాని ననుట, తత్ప్రదుష్టు = ఆలాగు మిక్కిలిఁ గష్టమైన, రూపభరణమునకు నిమిత్తమైన ఋషిశాపమును, శంసిన్ = చెప్పెడువాని, త్రిదశపదవాసిన్ = ఆకాశమందు నిలిచినవాని - గంధర్వరూపమును బొందిన యాకబంధుని ననుట. చూచి, పార్థివవరుండు = రాముఁడు.
| తే. | అతనిఁ బూర్వనామాదిక మడిగి వినుచు | 101 |
రామ. అతనిన్ = కబంధుని, ప్రశ్నోత్తరములు = రాముఁ డడుగఁగాఁ గబంధుఁడు వినుపింపఁగా, అతండు = కబంధుఁడు, చనియెను.
భారత. అతనిన్ = ఆనహుషుని, తత్ = ఆనహుషునియొక్క, శాపమోచననిమిత్తములు = శాపపరిహారహేతువులు, అయిన ప్రశ్నోత్తరములు - నహుషుఁ, డడుగఁగా ధర్మరాజు చెప్పఁగా, అతండు = నహుషుఁడు.
| క. | వనదేవత లర్చించిరి | 102 |
భారత. తత్ = ఆనహుషునియొక్క, శాపమోక్షముచేత, పరిమోచిత = విడిపింపఁబడిన, భీముఁడు గలవాని, ఆనృపనందనునిన్ = ధర్మరాజును, అర్చించిరి.
రామ. తత్ = ఆకబంధునియొక్క, శాపమోక్షముచేత, పరిమోచితభీ = విడిపింపఁబడిన భయముగల, మునిజనులచేత నుతుఁడైన, ఆనృపనందనునిన్ = రాముని, అర్చించిరి.
| వ. | ఇవ్విధంబున. | 103 |
| తే. | అడవులఁ జరించునాభవ్యు నరయ వచ్చె | 104 |