Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. అంతన్ = అటుతర్వాత, మహాశుగ = పాశుపతాద్యస్త్రములచేత నగు, అధికసంప్రాప్తి = మహత్త్వసిద్ధిని, శంసి = చెప్పుచున్న, సవ్యసాచి = అర్జునునియొక్క, సముపగమ = రాకచేత, వియోజిత = పోఁగొట్టఁబడిన, వ్యధత్వము = వ్యధగలవాఁడౌట, వైవస్వతసంతతి = ధర్మజుఁడు.

సీ.

తిరిగి వచ్చి యొకప్డు దీర్ఘకాలాదర్శ
           నావస్థఁ జెందనియతివశకలి
తార్తిఁ బావనిఁ గాన కడవుల వెదకుచు
           నంతఁ గానంబడి యాత్మహితత
నెరపుజటాయుర్వినేతపదంబుల
           జాడను జనిచని సకలకాన
నోగ్రజంతుత్రాసయోజనాయతదోఃప్ర
           భావభీమాంగకబంధమర్ద


తే.

నాతిదీప్తబలాధిక్యుఁ డగుచు నున్న
దారుణాహితాద్భుతదేహుఁ దత్ప్రదుష్ట
రూపభరణనిమిత్తర్షి శాపశంసిఁ
ద్రిదశపదవాసిఁ జూచి పార్థివవరుండు.

100

భారత. తిరిగివచ్చి, ఒకప్డు = ఒకనాఁడు, దీర్ఘకాల = తడవుగా, ఆదర్శనావస్థ జెందన్ = కానకుండుటఁ బట్టి, నియతివశ = అదృష్టవశముచేత, కలిత = పొందఁబడిన, ఆర్తిన్ = పీడగలవాని, జటాయుః = జటునియొక్క యాయువును, వినేత = పో మొత్తిన భీమునియొక్క, పదంబుల = అడుగులయొక్క, జాడను, జంతువులకు, త్రాస = భయముయొక్క, యోజన = పుట్టించుటయందు, ఆయత= అధికమైన, దోఃప్రభావభుజశక్తి గల, భీమునియొక్క, అంగక = శరీరముయొక్క, బంధ = కట్టుటయందును, మర్దన = పీడించుటయందును, అతిదీప్తమైన బలాధిక్యము గలవాఁడై, ఉన్న = ఉండిన, దారుణ = భయంకరమైన, అహితా = సర్పత్వముచేత, అద్భుతదేహుని, తత్ = ఆ, ప్రదుష్టమైన రూపభరణమునకు నిమిత్తమైన, ఋషిశాప = సప్తర్షిశాపమును, శంసిన్ = చెప్పుచున్నవాని - నహుషుని ననుట, పార్థివవవవరుండు = ధర్మరాజు, జరిపెనని ముందరి కన్వయము.

రామ. తిరిగివచ్చి యొకప్పుడును, దీర్ఘకాలమదర్శనావస్థఁ జెందని = తడవు చూడకుంటలేని, అతివన్ = సీతను, శకలిత= ఖండింపఁబడిన, ఆర్తిగలదానిన్ = సకలమైనయాపదలను మరలించుదాని ననుట, పావనిన్ = పవిత్రమైనదాని, కానక, అంత, కానన్ = అడవిలో, పడి, జటాయుర్వినేత = జటాయఁ వనెడి పక్షిరాజుయొక్క, పదంబులజాడన్ =