రావణునిచేత, ఘనమౌనట్టుగా - నిర్బంధించి యనుట, నియుక్త = నియోగింపఁబడిన, తచ్చమూరు = ఆమాయామృగముయొక్క, “చమూరుశ్చేతిహరిణః" అని అ. దర్పమడంచి = సంహరించి, త్రాస = భయముచేత, “మణిదోషే భయే త్రాసః” అని అ. చకిత = భయపడిన, దార = సీతయొక్క, వచనములవలన నాగతుఁడైన, భ్రాతృ = లక్ష్మణునియొక్క, దర్శనమున, మానసములో, అమోదంబు = ఖేదమును, పూనెను.
భారత. తన ప్రియమును వేడ్క పెంపును శోభిలఁగా, కృష్ణ = ద్రౌపది, సారంబు = శ్రేష్ఠమైన, సౌవర్ణసారస = బంగారుతామర, అధికశ్రీలచేత, తాదృక్ = అట్టి, అబ్జములకున్ = పద్మములకు, అబ్బకదానవాంతకుండు = బకాసురశత్రుడైన భీముఁడు, రామభద్రుండు = ఒప్పెడి భద్రము గలవాఁడు, తామరలు = పద్మములను, దృష్టి కొనరు = కంటి కింపైనవాని, తామరలకు విశేషణము కైకొని, పౌలస్త్య = కుబేరునిచేత, ఘనమౌనట్టుగా, నియుక్త = అంపఁబడిన, తత్ = ఆలాగున సన్నద్ధమై వచ్చిన, చమూసేనయొక్క, “పృతనానీకినీ చమూః” అని అ. ఉరు = అధికమైన, దర్పము నడంచి, త్రాసచకితులునై, దారవచన = ద్రౌపదివాక్యమువల్ల, ఆగత = వచ్చిన, భ్రాతృ = అన్నదమ్ములయొక్క, దర్శనమున, మోదంబు = హర్షమును, పూనెను, అంతన్ = ఆతర్వాత.
| క. | ముగుద యెఱుంగక పంచినఁ | 97 |
రెంటికి సమము సులభము.
| వ. | అని యతనిం బలుకుచు. | 98 |
| ఆ. | అంత నిజమహాశ్రుగాధిక్యసంప్రాప్తి | 99 |
రామ. అంతట, నిజ = స్వకీయమైన, మహాశున్ = అధికశోకముయొక్క, “మన్యుశోకా తు శుక్ స్త్రియా" మ్మని అ. ఆధిక్య = అతిశయముయొక్క, సంప్రాప్తిని, శంసి = చెప్పుచున్నవై, సవ్య = ఎడమదిక్కునకు, సాచి= అడ్డముగా, సముపగమ = రాకగల, వి = పక్షులచేత, అపశకునములచేత ననుట, యోజిత = కూర్పఁబడిన, వ్యధత్వము = వ్యధగలవాఁడౌట, ఒదవఁగా, వైవస్వతసంతతి = సూర్యవంశమందుఁగల, నృపలోకసత్తముండు = రాజేంద్రుఁడైన రాముఁడు, తిరిగివచ్చి యని ముందరిపద్యమున కన్వయము.