Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. వానిన్ = ఆజటాసురుని, మహాబల = వాయువుయొక్క, సుతుండు = భీముఁడు, అపతత్ = జాఱనట్టి, త్రప = లజ్జగల- శౌర్యముగలననుట, దోః = బాహువులచేత, “భుజబాహూ ప్రవేష్టోదోః" అని అ. జిత = అభ్యస్తములైన, ప్రహార = గ్రుద్దులయొక్క, రభస = వేగముచేత, భీషణంబగు, దురంబు = యుద్ధమును, ఒనరించెను, అంత, ఆనిరుపమబాహుసాహసవినిద్రునిచేత, జటాయువు = జటునియొక్క యాయువు, అడంగెను, జటాసురుఁడు చచ్చెననుట.

రామ. వానిన్ = రావణుని, ఎదిర్చి, మహాబల = అధికబలముగల, సు = లెస్సైన, తుండ = ముఖముయొక్కయు, “వక్త్రాస్యే వదనం తుండ” మని అ. పతత్త్ర = ఱెక్కలయొక్కయుఁ “గరుత్పవచ్ఛదఃపత్త్రం పఠేత్త్రం చ తనూరుహ” మ్మని అ. పద = పాదములయొక్కయు, ఊర్జిత = దృఢములైన, ప్రహారములయొక్క, దురంబును జటాయు వొనరించెను, అంత, అడంగె = రావణుని చత నొచ్చెను.

వ.

అక్కాలంబునందు.

95


సీ.

తనప్రియమును వేడ్క పెనుపుశోభిలఁ గృష్ణ
           సారంబు సౌవర్ణ సారసమధి
కశ్రీలఁ గ్రాల నొక్కటి దైవగతిఁ జూచి
           తాదృగబ్జముల కుత్కంఠ వెంచి
నలిఁ దదానయనంబు నకుఁ బంప దానిజే
           యంగ నబ్బకదానవాంతకుండు
రామభద్రుండు గరంబు దూరంబుగా
           నరిగి యంతటను దామరలు దృష్టి


తే.

కొనరు గైకొని పౌలస్త్య ఘననియుక్త
తచ్చమూరుదర్పమడంచి త్రాసచకిత
దారవచనాగతభ్రాతృదర్శనమున
మానసములోన మోదంబు పూనె నంత.

96

రామ. తనప్రియ = సీత, మును = మునుపు, కృష్ణసారంబు = లేఁడి, సౌవర్ణ = సువర్ణవికారభంగిని, సార = శ్రేష్ఠములైన, సమధికములైన, శ్రీల = కాంతులచేత, క్రాలన్ = ఒప్పఁగా, చూచి, తాన్ = తాను, దృగబ్జములకు = నేత్రపద్మములకు, ఉత్కంఠ వెంచి = అపేక్షించి యనుట, తత్ = అమృగముయొక్క, ఆనయనంబునకున్ = తెచ్చుటకు, పంపఁగా, అబ్బక = కూడక, దానవాంతకుండు = రామభద్రుండు, తాన్ = తాను, మరలుదృష్టికి = తిరిగివచ్చెడు యత్నమునకు, ఒనరు గైకొని = ఇంపుఁ బూని, పౌలస్త్య =