భారత. ఘనదర్పముచేత, ఉన్మూలిత = చెఱుపఁబడిన, బహుమునులు గలవాఁడు, జటుఁడను = జటాసురుఁ డనెడి, పరమకలుషమూర్తి = పాపాత్ముఁడు, వర్ణీ = బ్రహ్మచారియొక్క, ఆకృతితో వచ్చెనని ముందరి క్రియ.
| వ. | తదాశ్రమంబునకు వచ్చె నప్పుడు. | 88 |
| క. | కుతుకంబున మహితనయా, పతితదనుజవంచనప్రపంచనమృగధీ | 89 |
భారత. మహిత = శ్రేష్ఠమైన, నయ = ధర్మమార్గముచేత, ఆపతిత = ఆగతుఁడైన, దనుజ = జటాసురునియొక్క, వంచనప్రపంచన = కపటప్రతిపాదకముయొక్క, మృగ = తెలియుటయందుఁ గల, "మృగ అన్వేషణే" అను ధాతువుమీఁద, అచ్ప్రత్యయాంతము. ధీ = బుద్ధియొక్క, చతురిమము = సామర్థ్యము, లేక, జటాసురుఁడు బ్రహ్మచారియై రాఁగా రాక్షసుఁడని తెలియ కనుట, తాను, ఆశ్రితబుద్ధిన్ = ఆప్తుఁ డనెడు బుద్ధిచేత, చూచి, క్షితిజనపతి చేర ననుకూలించెనని ముందరిపద్యమునఁ గర్తయుఁ గ్రియయు.
రామ. మహితనయా = సీతయొక్క, పతి = ప్రియుఁడైన రామునియొక్కయు, తదనుజ = ఆయనతమ్ముఁడైన లక్ష్మణునియొక్కయు, వంచన = మోసపుచ్చుటను, ప్రపంచన = ప్రకటింపుచున్న, “పచ విస్తారే” అనుధాతువునఁ గర్తరిలుడంతము. మృగ = మృగరూపమైన మారీచునియొక్క, ధీచతురిమములను, ఏకతానాశ్రితబుద్ధిన్ = ఏకాగ్రచిత్త మౌనట్టుగా నాశ్రయింపఁబడినబుద్ధిచేత, చూచి, “ఏకతానోనన్యవృత్తిః" అని అ. సావధానుఁడై చూచి యనుట, క్షితిజను జేరనని ముందరి కన్వయము.
| క. | క్షితిజనపతి సన్నిధియం | 90 |
రామ. క్షితిజన్ = సీతను, అపతిసన్నిధియందున్ = పతిసన్నిధి లేనియెడ, అతనిమ = తనుత్వములేని, హితవృత్తిన్ = మంచివాఁడుంబలె ననుట, చేరన్ = దగ్గఱికి రాగా, రాఘవసతి = సీత, మతి = బుద్ధి, యతివిశ్వాస = సన్న్యాసియనెడు విశ్వాసముతోడ, సమన్వితగతిన్ = కూడినదౌచునుండఁగా, దృఢతన్ = ధైర్యముచేత - వెఱపులేక యనుట, అనుకూలించెనని క్రిందటి కన్వయము. ఉపచరించె ననుట, నిశిచరుఁడు = రావణుఁడు, అంతట, హరించెనని ముందరిపద్యమున కన్వయము.
భారత. క్షితిజనపతి = ధర్మరాజు, సన్నిధియందు, అతనిన్ = జటాసురుని, చేరను, అనుకూలించెన్ = సమ్మతించెను, మతి, అతివిశ్వాససమన్వితగతిన్ = అధికవిశ్వాస