యందు, చరాక్ష = తగులు చున్న కన్నులుగల - సాదరముగాఁ జూచునవి యనుట.“సక్థ్యక్ష్ణోః స్వాంగాత్ షచ్" అనెడుసూత్రమున బహువ్రీహియం దుకారాంతము. సుమత్త = లెస్సగా మదించిన, తరుణహరణమై = లేఁడిపిల్లలు గలదై, ఫలితార్థము తపోమాహాత్మ్యముచేత జాతివైరము విడిచి కూడియున్న సింహాదుల పెంటిపిల్లలమీఁద లేఁడిపిల్ల లెక్కు ననుట, ఒప్పునట్టి, పర్ణశాలలయొక్క సమీపమైన వనభూములయొక్క, బెడంగు = ఒప్పిదము, దృక్పర్వముగన్ = నేత్రపర్వ మౌచునుండఁగా, మెలఁగుచున్ = చరించుచును, ప్రబలెడి, మార్తాండసంతతిప్రభువునిన్ = ధర్మజుని, ప్రభుశబ్దము పుత్త్రవాచకము, మోసపుచ్చుటకు నంచితామోద మచ్చుపడఁగ, జటుఁడు వచ్చెనని ముందరిపద్యమున కన్వయము.
రామ. అప్పుడు, తత్ = ఆరామునియొక్క, విజయవార్తయొక్క, శ్రవణంబుచేన్ = వినుటవల్ల, మన్యుకలనన్ = కోపమహిమను, ఇలాత్మజ = సీతయొక్క, తెనుఁగు షష్ఠి. అమల = నిర్మలమైన, సద్రూప, ప్రవృత్తి = వార్తయొక్క మాధుర్యము, అడఁపన్ = అణఁచఁగా, అప్పుడు పుట్టినకోపమును సీతసౌందర్యమును విని యణఁచెననుట, త్వరిత = శీఘ్రముగా, భవ్య = కాఁగల, స్వ = తనయొక్క, అంతవర్తనా = నాశవర్తనకు, ఉచిత = తగిన, తీర్థ = రేవైన - ద్వార మైన దనుట, యాత్ర = ప్రయాణమును, చల్పి, తపోమహత్త్వముచేత సాధువైనవాని, సహచరీకృతములైన సింహశరభశార్దూలములు గలవాని, స్వార్థకప్రత్యయము. మారీచరాక్షసున్ = మారీచుఁడను రాక్షసుని, మత్తతరుణహరిణమై = హరిణరూపముచేత, రామునియొక్క పర్ణశాలాంచితవనభూములందు మెలంగుచున్న, ప్రబలున్ = బలవంతుడైనవాని, మారీచునికి విశేషణము. మార్తాండసంతతిప్రభువు = సూర్యవంశపురాజైన రాముని, మోసపుచ్చుటకు, అంచి = అంపి, తాన్ = తాను.
| క. | ఘనదర్పోన్మూలితబహు | 87 |
రామ. ఘనదర్ప = అధికమైన త్రుళ్లుచేత, ఉన్మూలిత = పెకలించి పాఱ వేయఁబడిన, బహుమునిజటుఁడు = అనేకమునులయొక్క జడలు గలవాఁడు, అనుపరమ = అణఁగుట లేని, కలుష = పాపముగల, మూర్తి = శరీరముగలవాఁడు, అసుర = రాక్షసుఁడు, కాంతికి, నికేతనమై = నివాసమయి, యతిభావనియతిన్ = సన్న్యాసిత్వనియమమును, ప్రకటించునట్టి, వర్ణ్య = వర్ణింపఁదగిన, ఆకృతితో.