Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షముఁడైన, నాకున్ = తనకు, ఈశుఁడు = ఈశ్వరుఁడు, ఒసఁగెను, ఈనరుండు = రాముఁడు, మద్బంధువైరము = నాజ్ఞాతులతోడి ద్వేషమును నిర్వహించెను, మనుష్యుఁడు రాక్షసద్వేషము చేసికొనెను గదా చెప్పెడి దేమి యనుచు.

భారత. దివ్యమైన, కోటీరము = కిరీటమును, ఆ-హరతీవ్రశక్తియుద్ధసహునకున్ = ఆహరునియొక్క తీవ్రశక్తిగల యుద్దము నోర్చినవానికి - నర్జునునికి, నాకీశుఁడు = దేవేంద్రుఁడు, ఒసఁగెను, ఈనరుండు, మత్ = నాకు, బంధువై = ఆప్తుఁడై, రమారూఢి నిర్వహించెను = తనయైశ్వర్యమును నిలిపెను, అనుచుఁ గోటీర మొసఁగునని క్రిందటి కన్వయము.

సీ.

అప్పుడు దనమదియందుఁ దద్విజయవా
           ర్తాశ్రవణంబుచే నశ్రమోత్థ
మగుమన్యుకలననిలాత్మజయమలస
           ద్రూపప్రవృత్తిమాధుర్య మడఁపఁ
ద్వరితభవ్యస్వాంతవర్తనోచితతీర్థ
           యాత్ర సల్పి తపోమహత్త్వసాధు
సహచరీకృతసింహశరభశార్దూలకు
           మారీచరాక్షసుమత్తతరుణ


తే.

హరిణమై రామపర్ణశాలాంచితవన
భూముల బెడంగుదృక్పర్వముగ మెలఁగుచుఁ
బ్రబలుమార్తాండసంతతిప్రభువు మోస
పుచ్చుటకు సంచితామోద మచ్చుపడఁగ.

86

భారత. అప్పుడు = అర్జునుఁ డింద్రునియొద్ద నుండెడుసమయమందు, తద్విజయవార్తా = ఆయర్జునుని వృత్తాంతముయొక్క, అశ్రవణంబుచేన్ = వినకుండుటచేత, అశ్రమ = తగ్గుపడక, ఉత్థమగు = పుట్టిన, మన్యుకలన్ = శోకాతిశయమును, “మన్యుర్దైన్యే క్రతౌ క్రుధి” అని అ. "కలా శిల్పే గౌరవేచ” అని వి. అనిలాత్మజ = భీమునియొక్కయు, యమ = నకులసహదేవులయొక్కయును, లసత్ = ఒప్పుచున్న, రూప = సౌందర్యముయొక్కయు, ప్రవృత్తి = నడకలయొక్కయు, మాధుర్యము = మనోహరత్వము, అడఁప, అర్జునవియోగదుఃఖమును భీమాదిసందర్శనమున నణఁపఁగా ననుట, త్వరిత = తీవ్రపడుచున్న, భవ్య = శుభమైన, స్వాంతవర్తన = మనోవ్యాపారమునకు, ఉచిత = తగిన, తీర్థయాత్ర సల్పి, తపోమహత్త్వముచేత, సాధు = లెస్స యౌనట్టుగా, సహచరీకృత = సహాయముగాఁ జేయఁబడిన, సింహశరభ శార్దూలములయొక్క, కుమారీ = పెంటిపిల్లల