| ఆ. | అతఁడు తన యవరజయాకర్ణనాసాస్ర | 83 |
రామ. అతఁడు= రావణుఁడు, తన, అవరజ = చెల్లెలైన శూర్పణఖయొక్క, ఆకర్ణనాసాస్రములు = చెవుల ముక్కున నంతట నుండెడు నెత్తురులు, “అస్రమశ్రుణిశోణితే” అని వి. నిజాక్షుల = తననేత్రములయందు, అఘవిలసనమ్ము = దుఃఖోద్రేకమును, "దుఃఖాంహో వ్యసనేష్వఘ" మని అ. నిగుడ్చ, అడిగి యడిగి, తత్ = ఆశూర్పణఖచేత, కథిత = తెలుపఁబడిన, సభార్య = సీతాసమేతుఁడైన, రామునియొక్క, వృత్త = అతీతమైన, కార్యము గలవాఁ డగుచు, తదాశ్రమంబునకు వచ్చె నప్పు డని నాలుగుపద్యములతర్వాతఁ గ్రియ.
భారత. అతఁడు, ఇంద్రుఁడు-తనయ = అర్జునునియొక్క, వర = శ్రేష్ఠమైన, జయముయొక్క ఆకర్ణనా = వినుటచేత, సాస్రములు = ఆనందబాష్పములతోఁ గూడిన, నిజాక్షులు, అనఘవిలసనమ్ము, తత్కథిత = ఆయర్జునునిచేతఁ జెప్పఁబడిన, సభార్య = సభయందలి పెద్దలకు, రామ = హృద్యమైన, వృత్త, కార్య = రక్షోయుద్ధము గలవాఁడౌచును, ఒసఁగెనని ముందరఁ గ్రియ.
| క. | తనకారుణ్యము మిక్కిలిఁ, గనుదామరగమిఁ దలిర్పఁగా గ్రక్కున లే | 84 |
భారత. తన, కారుణ్యము = దయ, నతగభీరమూర్తిన్ = వినయావనతమైన గంభీరమూర్తి గలవాని, తనయున్ = అర్జునుని, కడమ సులభము.
రామ. తనకు, కారుణ్యము = రక్తిమ, కనుదామరగమియందుఁ దలిర్పఁగా కోపమునఁ గండ్లెఱ్ఱ చేసికొని యనుట, ఆసనార్థభాగంబునన్ = పీఠార్ధమందు, తనయొక్క యున్నతమునైన, మూర్తిన్ = శరీరమును, ఉనుచుచును, అప్పుడే యుద్ధయాత్రకు లేవ నుద్యోగించి యనుట.
| తే. | దివ్యకోటీరమాహరతీవ్రశక్తి | 85 |
రామ. రావణుఁ డనుకొనుమాట, దివ్యకోటీ = దేవతాకోటియొక్క, రమా = సంపదను, హర = హరించెడి, తీవ్రశక్తిన్ = అధికశౌర్యమును, యుద్ధసహునకున్ = యుద్ధ