Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన్ = అనుగతవిచారమును, అను = ఉపసర్గము, మదిన్ = దేవతలమనస్సున, పెట్టి = పెట్టినదై, దివిజులప్రీతి నుడిగించెను.

క.

అనివార్యము ఖరవాహిని
దనవార్త పురఃప్రయాణత వెడలఁగ రా
మనివాసమున కరిగె మ
న్యునిరూఢతఁ గదలి యుద్ధృతోత్సాహగతిన్.

79

రామ. అనివార్యము = అణఁపరానిది, ఖరవాహిని = ఖరునిసేన, “వాహినీ పృతనా చమూః” అని అ. తనవార్త = తా వచ్చెడువార్త, పురఃప్రయాణతన్ వెడలఁగన్ = ముందుగానే వినఁబడఁగా, మన్యు = రోషముయొక్క, నిరూఢతన్ = పూర్తిచేత, "మన్యుర్దైన్యే క్రతౌ క్రుధి" అని అ. యుత్ = యుద్ధమందు, "సమిత్యాజిస్సమిద్యుద్ధ" మని అ. ధకారాంతము, ధృతమైనయుత్సాహగమనము చేత రామునివాసమునకు నరిగెను.

భారత. అనివార్య = వారింపశక్యము కానిదై, ముఖర = మ్రోసిపాఱునట్టుగా, వాహిని = ప్రవహింపుచున్న, ఎంత గుప్తము చేసినను వినఁబడునది యనుట, తనవార్త, మన్యు = శోకముయొక్క, ఉద్ధృత = పెకలింపఁబడిన, రామ = ఊర్వశి, కడమ సులభము.

సీ.

అది యంతయును వినియపుడు వేఱొకచంద
           మైచింతనున్న యత్యాత్మఖేద
జనకుననుంగుపట్టిని దగఁ బిల్చి నీ
           యీశాపదానంబు నే నెఱుఁగుదు
మదిచింత వలదు నీ కిది యనిష్టసమాగ
           మము గాదు నాదగుమాటఁ జేసి
ఘనమోదమున నుండుమనుచు జిష్ణుఁడు సుమి
           త్రానందనుఁడు దేర్చె బూనియంత


ఆ.

సారతరబలారి శాసనోద్దీప్తసం
రంభవిభవుఁ డగుచు రామవిభుఁడు
భుజవశీకృతాజివిజయుండు వేల్పుల
జయజయస్వనాతిశయము నిగుడ.

80