Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌందర్యముయొక్క, "రూపం స్వరూపే సౌందర్యే" అని అ. దివ్యధామ = దివ్య గృహములయందు, ఒప్పెసగు = క్రియ, కడమ సులభము.

తే.

అంత శౌర్యాశ్రయం బైన యట్టిమేటి
వీడు నాకాహవస్పృహాన్వీతధామ
కాంతిఁ జూచిపోయెద నని కదలి వచ్చి
నాఁడ నెఱి సూపుమదనుగుణక్రమమున.

97

రామ. అంతయైన, శౌర్యాశ్రయం బైనయట్టిమేటివి, ఈడు నాకు = నాకు సరియైనవాఁడవు, ఆహవస్పృహ = యుద్ధవాంఛతోడ, అన్వీత = కూడిన, శౌర్యముతోఁ గూడిన దనుట, ధామ = ప్రతాపముయొక్క, కాంతి = స్ఫురణచేత, ఈడైనవాఁడవని క్రిందటి కన్వయము, కాంతిపదము. కముకాంతౌ అన్న యుదాహరణమున నిచ్ఛాపరమైన నవును. యుద్ధవాంఛను బ్రతాపవాంఛను నీడైనవాఁడవు. అటు గనుకనే నచ్చినాఁడను, మత్ = నాకు, అనుగుణక్రమమున, నెఱిసూపు = ఎదిరింపుమా.

భారత. అంతట, శౌరి = కృష్ణునికి, ఆశ్రయం బైనయట్టిమేటివీడు = ద్వారకను, నాక = స్వర్గముతోడ నగు, ఆహవ = యుద్దముయొక్క, స్పృహ = కోరికతోడ, సామ్యముతోడ ననుట, అన్వీత = కూడిన, ధామ = గృహములయొక్క, కాంతిగలదాని, చూచి పోయెదనని వచ్చి, నాఁడ = నాఁడే, మదనునియొక్క, గుణక్రమమునన్ = గుణానుసారమున, చేరి యని ముందటిపద్యమున కన్వయము.

క.

తెరలక మనము సుభద్రా
కరనాళీకగ్రహేచ్ఛ గప్పఁగఁ జనునా
దొర యదుపురిఁ జేరి జనవి
సరముల కెఱుకపడనీక శౌర్యతనుఘృణన్.

98

భారత. మనము = మనస్సును, సుభద్రా = సుభద్రయొక్క, కరనాళీకగ్రహేచ్ఛ = హస్తపద్మగ్రహణవాంఛ, వివాహేచ్ఛ యనుట, కప్పఁగన్ = ఆక్రమింపుచుండఁగా, చనునాదొర = చనుచున్న యర్జునుఁడు, యదుపురిన్ = ద్వారకను, శౌరి = కృష్ణునియొక్క, అతను = ఆనల్పమైన, ఘృణన్ = దయను, "ఘృణా జుగుప్సాకృపయోః” అని వి. ఎఱుకపడనీక, తిరంబై పోయె నని ముందటిపద్యములోఁ గ్రియ.

రామ. మనము = ఇద్దఱమును, సుభద్రాకర = శుభాస్పదమైన, నాళీకగ్రహేచ్ఛ = శరగ్రహేచ్ఛను - యుద్ధవాంఛ ననుట, “నాళీకం శరపద్మయోః” అని వి. కప్పఁగఁ జనునా = అణఁపవచ్చునా, నీకు, అశౌర్యత = శౌర్యహీనత్వముచేతను, ఘృణన్ =