వ్యయము సుప్రసిద్ధము. ఆంధ్రశబ్దరత్నాకరమునం దకారమున కీయర్ధము నిరూపించి కళాపూర్ణోదయములోని “ఉ. ఇమ్ముగ సర్వధర్మములు నీవ యెఱుంగుదు” అని యుదాహరింపఁబడి యుండెడు
| శా. | "వేయుం జెప్పె డిదేమి మౌనివర సద్వృత్తంబుచే నేమిటం | |
ఆ-2. ప-47.
ఇందుఁ జతుర్థపాదాదియందు రామాయణార్థమున 'వేఁడెదన్ + దేవరన్ + న్యాయంబు' అని యన్వయించుచో “దేవరన్న్యాయం” బని ద్వినకారకరూపంబును, భారతార్థమున “దేవరన్యాయం" బని యేకనకారకరూపంబును గలుగుటం జేసి తంత్రసమాహృతరూపమును రెండర్థములకుఁగాఁ బ్రయోగించునెడ నన్యతరార్థము నవ్యాకరణవిరోధం బగునని యూహింపవచ్చుఁ గాని, ద్వినకారకరూపమునే సాధుపాఠముగా నంగీకరించి భారతార్థమును బోధించు నేకనకారకరూపమునందు “అనచిచ” యను పాణినీయసూత్రముచే నకారద్విత్వముఁ గల్పింపఁబడునేని వ్యాకరణవిరోధంబు గలుగదు. ఇట్లే—
| తే. | “వఱలునచ్యుతసఖ్యాతివర్ణితాతు, లప్ప్రదీప్తి ని ట్లలరు నీవిప్ప్రభావ | |
ఆ-2. ప-104.
ఇందు ద్వితీయపాదమందు రామాయణార్థమున విప్రభావము విప్రత్వ మనుచో నేకపకారకరూపంబును భారతార్థమున ఈ + ప్రభావమని యన్వయించుచో సంధివశమున “ఇప్ప్రభావ” మని ద్విపకారకరూపమునుం గూర్చునెడను దాని ననుసరించి పాదాదియందుఁ బ్రాసయతినిమిత్తమై “అతులప్ప్రదీప్తి” యనుచోటను ముందుఁ జెప్పినరీతిని “అనచిచ” యనుసూత్రముచేఁ బకారద్విత్వముఁ గల్పించి ద్విపకారకరూపమునే యుభయార్థములందును సాధుపాఠముగా గ్రహింపఁదగును. ఇట్టిచోట్లనెల్ల నిట్లే సమాధానము కల్పనీయ మై యుండెడు.
| చ. | “చనియెఁ బ్రశాంతమై యనలసత్వరహేతివిహారవృత్తిచే | |