| | సనుఁ గొనివచ్చెఁ దానవరజస్ఫురణాఢ్యునిఁ జేసి క్రమ్మఱన్ | 73 |
రామ. అనలస = అమందమైన, త్వర = వేగముగల, హేతి = ఖడ్గముయొక్క, “రవేరర్చిశ్చ శస్త్రం చ వహ్నిజ్వాలాచ హేతయః" అని అ. విహారమందు, వృత్తి = వర్తన గల, చేతన = బుద్ధి, "ప్రతిపద్జ్ఞప్తి చేతనా” అని అ. ప్రశాంతమై చనియె నని వింటిమి. ఇట్టియతిధర్మున్ = మునిధర్మము గలవాని, యమోదయున్ = యమముయొక్క, యుదయము గలవాని, “శరీరసాధనాపేక్షం నిత్యం యత్కర్మ తద్యమః” అని అ. రాజమానశాసనున్ = క్షత్రియగర్వాపహారి యైనపరశురాముని, మన = మనయొక్క, పృథక్ = వేఱువిధముగా, ఊఢ = వహింపఁబడిన, భాగ్యమహిమస్థితి, కర్త, క్రమ్మఱ, నవ = నూతనమైన, రజోగుణముయొక్క, స్ఫురణాఢ్యునిఁ జేసికొనివచ్చెను. అని యనేకు లనేకవాక్యములు పలుకనని ముందటిపద్యమున కన్వయము.
భారత. గూఢమైన భాగ్యమహిమస్థితి గలది, మనపృథ = కుంతి, అనల = అగ్నియొక్క, సత్వర = తీవ్రమైన, హేతి = జ్వాలలయొక్క, విహార, వృత్తిచేతన = వర్తనచేతనే, ప్రశాంతమై చనియెనని వింటిమి, అతిధర్ముని, యమోదయున్ = ధర్మజుని, రాజమాన = ప్రకాశింపుచున్న, అవరజ = తమ్ములయొక్క, “యవీయో వరజానుజాః” అని అ. స్ఫురణాఢ్యునిఁ జేసి క్రమ్మఱఁ దాను గొనివచ్చెను.
| తే. | అని యనేకు లనేకవాక్యములు పలుక | 74 |
భారత. సముద్వేగ = సంతోషాతిశయముతోఁ గూడునట్టుగా.
రామ. భీమ = భయంకరుఁడైన, అగ్రజన్మున్ = బ్రాహ్మణునిఁ - బరశురాముని, 'ద్విజాత్యగ్రజన్మభూదేవబాడబాః” అని అ. నిజపురః = తనముందట.
| ఉ. | పేర్మినివిగ్రహించినను భీమధనంజయలీలఁ బేర్చుత | 75 |
రామ. ధనంజయ = అగ్నియొక్క, “వీతిహోత్రో ధనంజయః" అని అ. లీలఁ బేర్చు, తద్ధర్మజతేజము = ఆపరశురామునివింటివలనఁ బుట్టిన శౌర్యము, అంతర్మనుఁడై = ఖిన్నమనస్కుఁడై, “దుర్మనా విమనా అంతర్మనాః" అని అ. మహీధవుఁడు = దశ