శ్లాఘన్ = శ్లాఘనచేత, ఉండువీరున్ = అర్జునుని, భీమ = భీమునియొక్క, బాహాసహాయుఁడై పరశూరులన్ = శత్రువీరులను, ఓర్చినట్టి, ఆహవజ = యుద్ధజన్యమైన, యశ = కీర్తిచేత, అభిరాముండు, అని వెదకుచు, అవలత్ = చలింపని, ఆశన్ = అపేక్షచేత, పుర = పట్టణమందు, స్థితజనకదంబకము, కర్త.
| వ. | కనుంగొనుజనులు తదనంతరంబ. | 70 |
| సీ. | ఎంతయు నద్భుతం బీరామభార్గవ | |
| తే. | యొదవు మనభాగ్యమహిమ కయోనిజాత | 71 |
భారత. ఈరామ = ద్రౌపది, భార్గ = భర్గసంబంధమైన, వర = వరములయొక్క, అమల = నిర్మలమైన, సత్ప్రౌఢి = మహత్వమును, బలవత్ = బలవంతులైన, అనేకపతులన్ = అయిదుగురుభర్తలను, భజించెను. ఏతత్ = ఈద్రౌపదియొక్క, వర = పతులైన, పురుషులు, అన్యోన్యంబు నొరసి యెట్టు గాఁగలవారొ, జనులు ద్రౌపదితో ననెడుమాట, మనభాగ్యమహిమకు నక్కొదవ లేల యొదవు, మహితమైన, నయ = నీతిగలదానా, కృష్ణ = ద్రౌపదీ, అనుచు సందడిలిరి.
రామ. ఈరామభార్గవరాముల, లసత్ప్రౌఢి, అనేకప = గజములయొక్క, “ద్విరదో నేకపోద్విపః” అని అ. తులన్ = సామ్యముచేత, ఏతత్ = ఈ, వరపురుషులు, మహితనయ, కృష్ణమృగనేత్ర, కడమ సులభము.
| వ. | మఱియును. | 72 |
| చ. | చనియెఁ బ్రశాంత మై యనలసత్వరహేతివిహారవృత్తిచే | |