భారత. విదురమంత్రి = విదురుఁడు మంత్రిగాఁ గల, ధృతరాష్ట్రుఁడు, అంత = వివాహవృత్తాంత మంతయు, విని, హతమనోవిచారుఁడై, పాండవు లేమైరో యనువిచారమును విడిచి, తనదుపురికి, కొడుకులన్ = ధర్మరాజాదులను, వధూయుతముగన్ = ద్రౌపదితోఁ గూడ, తోడ్కొంచురాఁగ = తోడి తెచ్చుటకు, అనుప నని ముందరిపద్యమున నన్వయము.
రామ. అంత, విదుర = వివేకులైన, “జ్ఞాతాతువిదురోవిందః” అని అ. మంత్రి = ప్రధానులచేత, ధృత = ధరింపఁబడిన, రాష్ట్రము గలవాఁడు, వినిహతమనోవిచారుఁడై, పుత్త్రుల కనుకూలవివాహము లాయెను గనుక, రాఁగన్ = రాఁగా.
| సీ. | ప్రౌఢాఁ బేర్చినవారిభావ మెలర్పంగ | |
| తే. | బఱపె మిక్కిలిఁ జూడ్కులందఱిని గడచి | 69 |
రామ. నవ = నూతనమైన, అరిభావము = శత్రుత్వము, ఎలర్పంగ, అనుపశాంత = శాంతము గాని, ఆత్మతన్ = బుద్ధి గలవాఁ డౌటచేత, ఆరుగుదెంచి, రాకుమారులవైరి, శ్లాఘనము గలవాఁడు, అర్జునున్ = కార్తవీర్యార్జునుని, పరశు = గండ్రగొడ్డలిచేత నగు, ఊరు = అధికమైన, లసత్ప్రతాపముతోడ, అన్విత = కూడిన, బాహా = భుజములు, సహాయముగాఁ గలవాఁడై, ఓర్చినట్టి = జయించిన, రాముండు = పరశురాముఁడు, అనిన్ = యుద్ధమందు, పురః = ముందట, స్థితజనకదంబకముయొక్క, చిత్తములను, మహా, దర = భయమువల్ల నైన, సంభ్రమము = బెగడుట, ఒలయన్ = వర్తింపఁగా, అతనిపైన్ = రామునిపై, చూడ్కులఁ బఱపెను.
భారత. ప్రౌఢిఁ బేర్చినవారిని, అనుపన్ = అంపినను, ఆకుమారు లరుగుదెంచిరి, ఆవైరిలోకాభిగమ్య = శత్రుజనమునకుఁ బొందరాని, భుజా = బాహువులయొక్క, “దోః ప్రవిష్టో భుజో బాహుర్భుజాసంకథ్యతే బుధైః” అని యా. విజృంభణగుణ,