Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంబును, భారతార్థమున “ఒప్పెన్ + సగురూఢాపూర్వసత్కీర్తితోన్" అనుచో నర్ధానుస్వారరహితరూపమునుం గూర్చునెడను సమాధానము కల్పనీయంబు.

సీ.

“ధృతిఁ గుంతిమద్రభూపతుల నెయ్యఁపుగన్య, కలననవాలుఁదూపుల జయించి
యలరారునతనుజయశ్రీల వరియించె, యవనసౌరాష్ట్రభూధవుల గెలిచె
ద్రవిడకళింగసాల్వవిదర్భవసుధాధి, పతుల నోడించి కప్పములు గొనియెఁ
జోళనేపాళపాంచాలకేరళమత్స్య, వత్సభూపతులగర్వం బడంచె


తే.

శకయుగంధరఘూర్ఖరాశ్మంతసింధు, లాటభూపాలముఖ్యుల నోటుపఱిచె
జగతిఁ గోసలకేకయమగధులతన, యలవరించినయాజ్ఞలో మెలఁగఁ జేసె.”

ఆ-1. ప-7.

ఇందుఁ దేఁటగీతి మూఁడవపాదమునందు రామాయణార్థమున 'కోసలకేకయమగధులతనయలన్ + వరించి + నయాజ్ఞలోన్ + మెలఁగన్ + చేసె' ననియు, భారతార్థమున 'కోసలకేకయమగధుల + తన + యలవరించిన + యాజ్ఞలోన్ + మెలఁగన్ + చేసె' ననియు నన్వయించునెడ భారతార్థమందు “మగధుల” అనుపదమందలి ద్రుతమున కర్ధానుస్వారమును మీఁదిపరుషమునకు సరళాదేశమును రాగా "మగధులఁదన” యనియు రామాయణార్థమందు సమాసమునందు వాని కవకాశము లేదు ' గావున “మగధులతనయల” ననియు రూపభేదము గన్పట్టెడు. ఒక్కయర్థమునకుఁగా నొక్కరూపము గ్రహింతుమేని యర్థాంతరకల్పనమున వ్యాకరణవిరోధము తప్పక కలుగు నని యూహింప నవకాశము చూపట్టెడుఁ గాని యిక్కడ ఖండబిందుసరళాదేశములు లేని "మగధులతనయలవరించినయాజ్ఞలో మెలఁగఁ జేసె” ననుపాఠమే సిద్ధాంతీకరించి యర్థాన్వయము మార్పఁబడునేని వ్యాకరణవిరోధము గలుగదు. అయ్యర్థాన్వయకల్పనం బెట్టిదనిన; భారతార్థమందు 'కోసలకేకయమగధులు + అ' అని యితరప్రయత్నవ్యవచ్ఛేదార్థక మగునకారావ్యయమును విభజించి కోసలకేకయమగధులు తమంతట తామే 'తన + అలవరించిన + యాజ్ఞలోన్ + మెలఁగన్ + చేసెన్ ఏర్పా' టనుకర్మవాచకపదమధ్యాహార్యము. ఇట్టు లన్వయించినచో ద్రుతమునకును ద్రుతస్థానమున ఖండబిందువునకును మీఁదిపరుషమునకు సరళాదేశమునకుఁ బ్రసక్తియే గలుగదు. కావున వ్యాకరణవిరోధ మేమిటం బొసఁగదు. ఇతరప్రయత్నవ్యవచ్ఛేదార్థకమయిన యకారా