సంచిత = సంపాదింపఁబడిన, తపస్సుయొక్క ఫలంబులు, ఏగురుపతు లై రటంచును, చతుర = సమర్థములైన, ఆకారములను, భాక్ = పొందిన, దివ్య = ధర్మానిలశక్రాశ్వినులయొక్క, తేజః = అంశలయొక్క మణిభూషణములచేత, ఉజ్జ్వలత్ = ప్రకాశింపుచున్న, ఆశ = దిక్కులుగల, రథులన్ = రథములు గలవారిని, మాంగలిక = శుభార్థములైన, వస్త్రాదులు గల, పాండుసూనులన్ = పాండవులను, కన్నులపండువుగఁ బౌరాళి యేతెంచి చూచెనని యన్వయము. ద్రౌపది పూర్వజన్మమందు నీశ్వరునిఁ గూర్చి తపస్సు చేసి యైదుగురుపతుల వేఁడెనని యాదిపర్వములో విస్తారముగాఁ జెప్పియున్నది.
రామ. నృపకన్యకలకు, అనిందిత = నిందింపఁబడని, నవ, భ్రమరక = ముంగురులు గల, “తే లలాటే భ్రమరకాః” అని అ. ఆస్య = ముఖములయొక్క, విలాసలక్ష్మిచేత, నిరస్త = తిరస్కృతుఁడైన, పూర్ణతారకాధిపతి గలవారికి, లోక = భువనములయొక్క, "లోకస్తు భువనే జనే” అని అ. రక్షణార్థమైన, చతుః = నాలుగైన, ఉజ్జ్వల = ప్రకాశించుచున్న, దాశరథులన్ = దశరథపుత్రులను, అంగరాగ = మైపూతలును, పాండు = ధవళములైన, సూనులన్ = పుష్పములును గలవారిని, దాశరథులఁ బౌరాళి చూచెను.
| చ. | అలఘుతరాజవంశమణులై విలసిల్లెడునక్కుమారకుల్ | 67 |
రామ. అలఘుతర, అజ = అజునియొక్క, వంశమునకు, మణులై = అలంకారమైనవారై, విలసిల్లెడు, నలుగురు = రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, చతుః = నాల్గైన, ఆకృతిన్ = ఆకారములచేత, మెఱయు, తత్ = ఆ, జనక = జనకునియొక్క, అన్వయభాగ్యలక్ష్మినా నలరెడు పెండ్లికూఁతుల - జనకునిభాగ్యలక్ష్మి నాలుగాకారములై యున్నవారి నని యుత్ప్రేక్ష. పెండ్లియై, అతులితానందమునఁ బేర్చిరి యని ముందరిపద్యములోఁ గ్రియ.
భారత. అలఘుతన్ = అలఘుత్వమున, రాజవంశ = చంద్రవంశమునకు, "రాజాప్రభౌ నృపే చంద్రే" అని వి. అక్కుమారకులు = పాండవులు, చతురాకృతిన్ = మనోహరాకృతిచేత, నలు = నలునియొక్క, గురురూపవైభవకళలను, మీఱుచు, తత్ = ఆద్రౌపదియొక్క, జనక, పెండ్లికూఁతు, లసదాదర మొప్పఁగ, కడమ సరి.
| తే. | అతులితానందమునఁ బేర్చి రంత విదుర | 68 |