| | నేకమై తనుఁ జాల నెచ్చరింప నిజాను | |
| తే. | యునికి నపు డాసుబాహుజయోపశోభి | 59 |
భారత. పాండు = పాండురాజుయొక్క, కీర్తిసమృద్ధికి, జనకుండు = ఉత్పత్తిస్థాన మైనవాఁడు, ధర్మరాజు, ఈడిత = స్తోత్రము చేయఁబడిన, “ఈడిత శస్త పణాయిత పనాయిత ప్రణుత ప్రణిత పనితాని" అని అ. కర్మ = ప్రయోజనములయంచు, పరుఁడు, స్వజనని = కుంతియొక్క, ఉక్తియున్ = వాక్యమును, వరగుణుఁడైన వ్యాసమునీశ్వరునియొక్క యాజ్ఞయును, ఎచ్చరింప, నిజానుజులన్ = భీమాదులను, తమకు నందఱకును = అయిదుగురికిని, దారభావంబునన్ = భార్యాత్వముచేత, ఆ, సుబాహుజయోపశోభితములైన = భుజశౌర్యశోభితులైన, కుమారరత్నములకు, రత్నశబ్దమునకు విశేషణము గనుక శోభితశబ్దము నపుంసకము, ఆభుజద్రవిణశుల్క యను = భుజసత్త్వమె యుంకువగాఁగల ద్రౌపది యనెడి, "ద్రవిణంతురో బలశౌర్యాణి” అని అ. జలజాతబాంధవరుచి = సూర్యదీప్తి, హృత్ = హృదయములనెడి, అబ్జ = తామరలకు, ఆమోద = హర్ష మనెడి సౌరభ్యముయొక్క, శ్లిషరూపకము. “అమోదో హర్షగంధయోః” అని వి. గరిమన్ = అతిశయమును, ఒసఁగెను.
రామ. అసమానమై, పాండు = శుభ్రమైన, కీర్తిసమృద్ధి గలవాఁడు, జనకుండు, ధర్మరాజి = ధర్మపంక్తిచేత, ఈడిత = స్తోత్రము చేయఁబడిన, స్వజన = తనయాప్తజనులయొక్క, నియుక్తియున్ = నియోగమును, వర = వరుల యొక్క, గుణవ్యాసము = గుణవిస్తారమును, “విస్తారో విగ్రహో వ్యాసః" అని అ. "శ్రితోరుర్వ్యాసోమహాభారతసర్గ యోగ్యః” అని నైషధప్రయోగము. ఈశ్వరాజ్ఞయు, నిజానుజున్ = తనతమ్ముఁ డైనకుశధ్వజుని, ఉదారభావంబునన్ = మహత్త్వముచేత, సుబాహు = సుబాహుఁ డనురాక్షసునియొక్క, జయముచేత, ఉపశోభి = ప్రకాశించెడు రామునియొక్క, తమ్ము లయిన కుమారరత్నములకు = లక్ష్మణభరతశత్రుఘ్నులకు, ఆ, భుజద్రవిణశుల్క = సీతయొక్క, అనుజలన్ = చెల్లెండ్రైనయూర్మిళామాండవీశ్రుతకీర్తులను, జాత = పుట్టిన, బాంధవ = బంధుత్వమునందుఁ గల, రుచిన్ = అపేక్షచేత, “అభిషంగే స్పృహాయాంచ