లయిన, పురః = ముందటికి, హిత = శ్రేయస్కరములైన, ముఖ = సంచారములు గల, “ముఖం నిస్సరణేవక్త్రే ప్రారంభోదయయోరపి” అని వి. వి = పక్షులచేత, “వినిర్విఘ్నే చతు పక్షిణి" అని వైజయంతి. ఆకౢప్త = మిక్కిలిఁ జేయబడ్డ, సన్మానులై = బహుమానము గలవారై "మానశ్చిత్త సమున్నతిః” అని అ. మంచిశకునము లవుచునుండఁగా ననుట, చేరిరి. తచ్ఛబ్దము ప్రసిద్ధవాచక మైనందుకు, “అనుభవతి శచీత్థం సా ఘృతాచీముఖాభిః” అని నైషధమందు.
| ఆ. | అందుఁ దన్నృపాలుఁ డాత్మజ కిది యుంకు | 54 |
భారత. అందున్ = పట్టణమందు, ఘనమైన, మైనమూర్తి = మీనసంబంధ మైనయాకృతిగల, లక్ష్యంబు = గుఱిని - మత్స్యయంత్రము ననుట, కడమ సులభము.
రామ. ఘనమైన, మూర్తి = కాఠిన్యముచేత, “మూర్తిః = కాఠిన్యకాయయోః" అని అ. లక్ష్యంబు = చూడఁదగినదాని, వింటికి విశేషణము, చూచిరి.
| వ. | అటమున్న సకలదిగ్దేశాగతులైన రాజకుమారులు నిజశక్తితారతమ్యం | 55 |
రామ. వ్యాపారములు పారముగాఁ గలయహంకారము గలవారై, వారలందున్ = రామలక్ష్మణులందు. భారతార్థమునకును నీలాగుననే.
| చ. | అనుపమదివ్యవిక్రమసమగ్రుఁడు రామవిభుండు జిష్ణుఁ డా | 56 |
రామ. జిష్ణుఁడు = జయశీలుఁడు, రామవిభుండు, రౌద్ర = రుద్రసంబంధమైన, ధనువును, ఉకారాంతము. “సోయం ధనురజనివక్రః" అని నైషధమందుఁ బ్రయోగము. అశ్రమ = అనాయాసముననే, భంగిగన్ = భంగము గలదానిఁగా, వంచి = విఱిచి యనుట, అభ్రగ = గగనచరులైన, అనిమిష = దేవతలయొక్క, లక్ష = లక్షసంఖ్యలయొక్క, హృదంబకవృత్తిన్ = హృదయముయొక్కయుఁ గన్నులయొక్కయు వ్యాపారమును, అద్భుతవార్ధిని ముంచుచును బాహులీలల నెరపెను.