శ్రాంతి = అలమటను, ఆత్మలోనన్ = మనస్సునందు, నెఱయ, గణింపఁడు = ఎంచఁడు, పూనికన్ = యత్నముచేత, మనస్స్థిరతన్ = మనస్స్థైర్యమును, వివరించును, ఆయనపూనికఁ జూచినను మనస్స్థైర్య మేర్పడుచున్న దనుట.
రామ. అన్నగరంబు=మిథిలాపురి, ప్రోదిఁ దనరారఁగ, తమ్ములఁ గన్నతల్లినాన్ = పద్మముల కుత్పత్తిస్థాన మనఁగా, సన్నుత = వర్ణితమైన, ఖేలన్ = లీలచేత, ఉండు = ఉండెడి, వికసన్నయన = తెలికన్నులయొక్క, ఏక = ముఖ్యమైన, విలాసగౌరవ = శృంగారాతిశయముయొక్క, అభ్యున్నతిచేత, తత్ = ఆపట్టణముయొక్క, వనాంతమునన్ = ఉద్యానవనమందు, ప్రోచెను. పద్మకాంతి గల నయనములచేతఁ బ్రోచె ననఁగాఁ గటాక్షించె ననుట. లక్షణాప్రయోగము. “గిరానుజగ్రాహతరాంనరాధిపః” అని నైషధమందు. తనశ్రాంతిని, మనస్స్థిరతన్విన్ = మనస్సున లగ్నమైన స్త్రీని - సీతను, వరించుపూనిక = వివాహ మగుయత్నమున, శ్రాంతిని గణింపఁడని యన్వయము.
| వ. | అది యట్లుండె వారలందఱు తత్ప్రకారంబున విపినమార్గవర్తనంబు | 47 |
రెంటికి సరి - సులభము.
| క. | చనిరి పురసవిధమార్గం | 48 |
రామ. పుర = మిథిలయొక్క, సవిధ = సమీపమైన, “సదేశాభ్యాససవిధసమర్యాదసదేశవ” త్తని అ. మార్గమందుఁ జనిరి. అపుడు, సత్ = లెస్సైన, ద్విజ = పక్షులయొక్క, లీలలను, నడపుచున్ = చేయుచును, మాధుకర = భ్రమరసంబంధమైన, “తస్యేద”మ్మని అణ్ప్రత్యయాంతము. అశనము = పూఁదేనె ననుట, ఒనఁగూర్చుచు, ఉపవనసంతతి = ఉద్యానపరంపర, వారల = రామాదులయొక్క, ఆత్మన్ = మనస్సును అలరఁజేసెను.
భారత. పుర = ఏకచక్రపురముయొక్క, ద్విజలీలలు = బ్రాహ్మణవేషములను, మాధుకరాశనము = భైక్షమును, పవనసంతతి = భీముఁడు, కడమ సరి.
| ఆ. | అందుదారవృత్తి నందితానేకచ | 49 |