| ఆ. | తొడగి యపుడు దాని తోఁబుట్టుగురుతర | 43 |
భారత. దానితోఁబుట్టుగు = హిడింబుఁడు, ఉరుతర, సంగర = యుద్ధమందు, పరఁగ వానిఁ గెలిచి, స్వగురుకథా = కుంతిధర్మజులమాటమీఁదనైన, ప్రమదయుక్తిన్ = హిడింబాసంయోగమునకు, అనుమతించెను.
రామ. దానితోఁ బుట్టు = రాగప్రౌఢితో గూడఁ బుట్టునట్టి, గురుతర, సంగరసము = ఆపేక్ష, ఉదీర్ణసరణిఁ బరఁగ, వానిన్ = ఆమన్మథరాగసంగవాంఛలను, గెలిచి = అణఁచి, స్వగురుకథా = విశ్వామిత్రుని గంగాసంభవాదికథలయందుఁ గల, ఆదరము, అమరఁగా, ప్రమద = సంతోషముయొక్క, యుక్తికి ననుమతించెను.
| వ. | అంత. | 44 |
| తే. | ఉరుగుణాద్భుతజనకసుతోదయమహి | 45 |
రామ. ఉరుగుణాద్భుతుఁడైన జనకునికి, సుతా = కొమార్తె యైన సీతయొక్క, ఉదయ = పుట్టుటచేత నైన, మహిమాతిశయమును సాధించి, పుణ్యజన = సుజనులచేత, కాంత = మనోహరమైనది, భాసురపురమణిన్ = పురశ్రేష్ఠమైన మిథిలయందు, అతఁడు = రాముఁడు, చూపుతగులు వహించెను.
భారత. ఉరుగుణుఁడైన యద్భుతజనకుఁడైన, సుత = ఘటోత్కచునియొక్క, పుణ్యజనకాంత = రాక్షసస్త్రీ హిడింబ, “యాతుధానః పుణ్యజనః" అని అ. అనిపించుకొనినన్ = పోయినను, ఆతఁడు = భీముఁడు, భాసురపు, రమణిన్ = హిడింబయందు, చూపుతగులు వహించెను = అనురాగము నిలిపెను.
| ఉ. | అన్నగరంబు ప్రోది దన రారఁగఁ దములఁ గన్న తల్లి నా | 46 |
భారత. అన్న = ధర్మరాజు, కరంబు = మిక్కిలియు, తమ్ములను గన్నతల్లిని, ఆసన్నుతఖేలనుండు = భీముఁడు, నయ = నీతియొక్క, నైక = ఉన్నతిచేత, ప్రోచెను = రక్షించెను, తన,