మున 'పూని + కల + శమంబు + మగ్నముగన్ + చేయుచు + అప్పు' డనియు నన్వయించుచో సంస్కృతాంధ్రభాషాద్వయశబ్దశ్లేషయు, సారంగబుద్ధిఁ జేసి యనునెడ రామాయణార్థమున గజపరత్వము భారతార్థమున మృగపరత్వముం గల్పించుటంజేసి సంస్కృతభాషార్థశ్లేషయుఁ గూర్చుటం జేసి మూటికిఁ గూడిక యిక్కడఁ జెప్పఁబడియె. ఇట్టివానికి గ్రంథమంతయు నుదాహరణమే కావున విశేషించి వివరింపఁ బని లేదని తలఁచుచున్నాఁడను.
ఇమ్మహాకావ్యమున శ్లేషనిబంధనము సేయునెడఁ గొన్ని వ్యాకరణవిషయములు విచారణీయములై నట్లు చూపట్టుటం జేసి వానిం గూర్చి కొంత చర్చించెద.
| క. | “వినియతనిందనపై నిడు, కొని యేఁగినియమికిఁ దగనిఘోరార్తి యొన | |
ఆ-1. ప-28.
ఇందు ద్వితీయపాదమందు రామాయణార్థమున 'ఏగి + నియమికిన్' అని యన్వయించుచో నసమాపకగమనక్రియావాచకం బయిన “ఏగి” యనుపదమున కర్ధానుస్వారము లేనిరూపమును, భారతార్థమున 'ఏన్ + కినియమికిన్' అని 'యన్వయించుచో సంధిని “ఏ” అనుపదమందలి ద్రుతమున కర్ధానుస్వారాదేశంబును దత్పర మగుపరుషవర్ణమునకు సరళాదేశంబును రాఁగా సార్ధానుస్వారరూపంబును గలుగుటవలన నీరెండర్థము లిక్కడఁ గల్పించుట వ్యాకరణవిరుద్ధ మనియుఁ, గల్పింపకున్న నర్థ మన్వయింపఁదనియుఁ దలఁపవచ్చుఁగాని “శ్లేషే సఖండనిర్బిందోర్మేళనం కుత్రచిన్మత” మను నథర్వణకారికావచనమున శ్లేషయం దిట్టివానికి మేళనము వృద్ధసమ్మతంబని నిర్ణీతమైయుండుటం జేసి, వ్యాకరణవిరోధంబు గలుగదు. దానఁ బైఁ జెప్పినరీతి నర్థాన్వయమున కసందర్భముం గలుగదు. ఇట్లే—
| మ. | “స్వనిదేశోన్నతి నంతట న్నెఱయుచున్ శక్తిం జతుర్దిఙ్నరేం | |
ఆ-3, ప-15.
అనుపద్యమున “ఒప్పెసగురూఢాపూర్వసత్కీర్తితోన్” అనునెడ రామాయణార్థమున “ఒ ప్పెసఁగున్” అనుచో సకారోత్తరార్ధానుస్వారవిశిష్టరూ