Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్కలే నాపి తన్వీ కిమివహి మధురాణాం మండనం నాకృతీనా” మని కాళిదాసును శాకుంతలమందుఁ జెప్పినాఁడుగనుక, పయోధరపదవ్యతిక్రమకర = కుచస్థలాతిక్రమమును జేయుచున్న - జాఱుచున్నదనుట, నవ = మనోహరమైన, అంశుకాంత = పైటయొక్క, వరణ = కప్పుటయందు, నిరతి = ఆసక్తిగల, శయ = హస్తములయొక్క, “పంచశాఖశ్శయః పాణిః" అని అ. సమున్నతియును = ఉపచారము గలదియు, ఐ, చిత్రం బొనర్చెనని క్రిందటి కన్వయము.

భారత. అలరుచున్ = వికారరహితుఁడై, తత్పుర = ఆవారణావతముయొక్క, స్ఫూర్తి, ఆరామ = ఉద్యానవనములయందున్న, పాదప = వృక్షములయొక్క, రాగము = వర్ణము, “రాగోనురక్తౌ మాత్సర్యే క్లేశాదౌ లోహితాదిషు” అని వి. ఆశా = దిక్కులయొక్క, అపవారణము = ఆచ్ఛాదనమును, “అంతర్ధిరపవారణ" మని అ. ఆచరింప, ఆయతి = ఉత్తరకాలఫలముచేతను, వసు = ద్రవ్యములచేతను, శోభనాకృతియు, సరసీ = కొలంకులచేత, కృతమైన, మానస = మానససరస్సుయొక్క, హ్రీకలనయున్ = లజ్జాస్థితి గలదియు, రత్నకాంచనములయొక్క, ధామ = గృహముయొక్క, శోభన్ = శృంగారముచేత, అవని = భూమికి, ఆభరణములైన వైభవములచేత, స్ఫురితయు, పయోధరపదవీ = మేఘమార్గముయొక్క, అతిక్రమమును, కర = చేయుచున్న, నవాంశువులచేత, కాంత = మనోహరమైన, వరణ = కోటయొక్క, నిరతిశయ, సమున్నతియున్ = ఔన్నత్యము గలదియు, ఐ, పురస్ఫూర్తిచిత్రం బొనర్చెనని యన్వయము.

తే.

హరిపురాభోగవార్తపెం పపుడు వారి
మదిఁ బొడమఁ దలపోసి రట్టిది యటంచుఁ
జెలువసంకోచవిభవవైచిత్రిఁ బరఁగఁ
బరఁగునానగరంబు గన్పట్టఁ జూచి.

39

భారత. చెలువు = ఒప్పిదము, పరఁగ, ఆనగరంబును జూచి, హరిపుర = అమరావతియొక్క, ఆభోగ = విరివియొక్క, వార్తపెంపు మదిఁ బొడమ, “సదృశాదృష్టచింతాద్యాః స్మృతిబీజస్య బోధకాః” అను న్యాయముగనుక, అట్టిది = అమరావతివంటిది, అటంచుఁ దలపోసిరి.

రామ. హరి=ఇంద్రునియొక్క, పురాభోగ = తొంటిసంభోగముయొక్క, వార్తపెంపు, వారి = రామాదులయొక్క, మదిఁ బొడమఁగా, రట్టు = పరపురుషసంగతివల్ల నైన దూఱు, ఇది యటంచుఁ జెలువ, సంకోచవిభవ = మిక్కిలి కొంకుచేతనైన, వైచిత్రిన్ = వింతలాగుచేత, పరఁగు = ప్రవర్తిల్లుచున్న, ఆన = ఆజ్ఞ, కన్పట్టఁజూచి, నుతి చేసిరని ముందటిపద్యమున కన్వయము.