Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధికమqచునుండఁ గాననుట, జిష్ణుఁడు = జయశీలుఁడు, రామbfభుండు, సముద్భాసిల్లెను = సంతసిల్లెను, సామర్థ్యసంపద్దురంధరుఁడు గనుక నీశ్వరునివిల్లు వంచి సీతను వరించెదనని మిక్కిలి తెలివి గలిగియుండె ననుట.

సీ.

అపు డేమి చెప్పన న్యాసాధ్యతద్ధను
            ర్వార్త సర్వక్షత్రవంశ్యులందు
మిగులఁ గర్ణాసహ్యముగఁ బర్వ నతఁడు త
            న్మహిమపెంపునరాతి మత్సరవిధి
నాత్మలో సరకుసేయక సభ్రమించె స
            న్మునికృప జనకునింటను వివాహ
మగుటకు మున్ను తదంబకాశ్చర్యమం
            త్రమహత్త్వకృతచండధామయుక్తి


తే.

నుదయ మందినమేటియన్యులకలఁగునె
యరయ ని ట్లర్కసంతతి ఖ్యాతిమహిమ
ధాత్రిపైఁ గుంద సూతసంతానభావ
గణనఁ బ్రబలుట తత్పోషకారణమున.

33

రామ. అతఁడు = రాముఁడు, తత్ = ఆవింటియొక్క, మున్ను = మునుపు, మహిమపెంపును, అరాతి = శత్రులయొక్క, మత్సరవిధిన్ = తనజయమును సహింపనివారితోడి ద్వేషమును, సరకు సేయక జనకునింట వివాహ మగుటకు, సంభ్రమించెన్ = త్వరపడెను. ఇంకఁ గవివాక్యము. తదంబక = ఆవిశ్వామిత్రునిబాణములయొక్క, ధామయుక్తిన్ = ప్రతాపయోగముచేత, ఉదయ = అభ్యుదయమును, అందినమేటి = రఘునాథుఁడు, అన్యులకున్ = పరులకు, అలఁగునె = లోపడునా, ఇట్లు, అర్కసంతతి = సూర్యవంశముయొక్క, ఖ్యాతి = మహిమ, తత్పోషకారణమునన్= ఆరాముఁడు పోషించుటవల్ల, ధాత్రిపై, కుంద = మొల్లలయొక్కయు, “మాఘ్యం కుంద” మని అ. సూత = పాదరసముయొక్కయు, “రసస్సూతశ్చ పారదే” అని అ. సంతాన = కల్పవృక్షములయొక్క, భా = కాంతియొక్క, అవగణనన్ = తిరస్కారమువల్లఁ బ్రబలుట.

భారత. తత్ = ఆయర్జునునియొక్క, ధనుర్వార్త మిగుల, కర్ణాసహ్యముగఁ బర్వ = కర్ణునికి నసహ్యముగాఁ బరఁగ, అతఁడు = ఆకర్ణుఁడు, తన్మహిమ = ఆధనుఃప్రావీణ్యముయొక్క, పెంపును, నర = అర్జునుమీఁదనున్న, మత్సరవిధిచేత సరకు సేయక సంభ్రమించెను, ఇంకఁ బూర్వకథాసూచనముగాఁ గవివాక్యము. తత్ = ఆయర్జునునియొక్క, అంబకున్ = తల్లియైన కుంతికి, వివాహ మగుటకు, మున్ను = మునుపే, జనకుని = కుంతిభోజునియొక్క, ఇంటను, సన్ముని = దూర్వాసునియొక్క, కృపన్ = అనుగ్రహమువల్ల,