వివాహము చేయించు యత్నము చేసిననాఁడై, మనఃప్రీతి, గురువై = ఆధికమై, తనర, జనక = జనకునియొక్క, ధామ = గృహమందున్న, భీమ = పరమేశ్వరునియొక్క, బాణాసన = వింటియొక్క, స్థేమ = బలిమియొక్క, స్థిరశబ్దముమీఁద నిమనచ్ప్రత్యయము. వార్తాప్రవర్తనము, అను = అనెడి, సుధ = అమృతమును, శ్రుతివీథికలను = కర్ణరంధ్రము లనెడు, ద్రోణులన్ = దొన్నెలయందు, “ద్రోణీ కాష్ఠాంబువాహినీ” అని అ. ప్రౌఢిమను, నించెన్ = నిండించెను-నిలిపె ననుట.
భారత. సంయమిదివ్యతేజమున = భరద్వాజమునివీర్యమున, కుంభిన్ = కలశమందు, జనించి, నయాదిలక్ష్మిన్ = నయాదిగుణసంపదచేత, అజేయుఁడైన విమలశీలుని, నిరఘున్ = అఘరహితుఁ డైనవాని, అత్యాశ్చర్యజనకమైన, ధామ = ప్రతాపముచేత, భీమ = భయంకరమైన, బాణానన = వింటివల్లనైన, స్థేమ = స్థైర్యగుణముయొక్క, వార్తాప్రవర్తనచేత, మను = ఒప్పుచున్న, భవ్యసుధన్వి = మంచివిలుకాఁడైనవాని - ధనుర్ధరుని ననుట. నూత్న మౌనట్టుగా విరచితమైన, అవధాన = ఎచ్చరికగల, శ్రుతివీథికలను = వేదమార్గవిచారముగలవాని, ద్రోణున్ = ద్రోణాచార్యుని, తన్నృపాలవరకుమారకులకు = కౌరవపాండవులకు, తాను, కూర్చువాఁడయి = ఆప్తుఁడై, గురువై = ఆచార్యుఁడై, తనర, మేదినీపతి = ధృతరాష్ట్రుఁడు, మన్నించెను, అని యన్వయము. సుతులును, కాంచుతమిన్ = అభ్యాసాపేక్షచేత, పొదలిరి = వర్తించిరి, కడమ సులభము.
| వ. | అందు. | 31 |
| మ. | గురుసంకల్పముచొప్పు దప్ప కెలమిన్ క్షోణీజనాశ్చర్యవి | 32 |
భారత. జనాశ్చర్యమైన, విస్ఫురణంబు = ఖ్యాతిని, ఒందను, శర = బాణములయొక్క, రామవిభుండు = మనోజ్ఞకాంతిగలవాఁడు, జిష్ణుఁడు = అర్జునుఁడు, సముద్భాసిల్లెన్ = లెస్సగాఁ బ్రకాశించెను. క. 'సల్లలితైకపదముపై, ని ల్లుండుట యగుట యనఁగ నెల్లెడఁ జను రా, జిల్లుట ప్రభవిల్లుట శో, భిల్లుట వర్తిల్లు టనఁగఁ బెనుపై యునికి' నని యాంధ్రభాషాభూషణమందుఁ గ్రియాపదములలోఁ బ్రభవిల్లుట యని యెత్తినాఁడు గనుక నుపసర్గముతోఁ గూడఁ జెప్పినాఁడు.
రామ. గురు = విశ్వామిత్రునియొక్క, సంకల్పముచొప్పు, ఆశ్చర్యవిస్ఫురణము = వింతైనకాంతిగల, క్షోణీజను = సీతను, పొంద = వరించునట్టుగా, ఉగ్రకార్ముకవరంబున్ = రుద్రచాపమును, వంపన్ = ఎక్కుఁబెట్టుటకును, మహాశరసోత్కర్షరయప్రయుక్తిన్ = అనురాగమహిమవేగప్రేరణచేత, ఎంతేన్ = మిక్కిలి, పొదలన్, అత్య