Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. అతఁడు = రాముఁడు, దానవి = తాటక, హతయైన వసుధయంద = నొచ్చిపోయినభూమియందే, మును = మునుపు, విశ్వామిత్రతాపసు = విశ్వామిత్రునియొక్క, హృత్ = హృదయమునకు, ప్రమోదస్ఫూర్తిని సాధించి, తద్గురుత్వశక్తి = ఆయనయొక్క గురుత్వముతోఁ గూడిన సామర్థ్యముచేత, వర్ణింప నెక్కుఁడై వఱల, అంబక = బాణములైన, ఘన = మేఘములును, అశని = పిడుగులును, గదా = గుదియలును, అసి = చంద్రహాసమును, ఆదులు = మొదలుగాఁ గలవాని, వారుణాస్త్ర-ఇందాస్త్ర-యామ్యాస్త్ర-రౌద్రాస్త్రములు మొదలైనయస్త్రము లనుట, “చంద్రహాసారిష్టయః” అని అ. కాంచెన్ = పరిగ్రహించెను, కావున, అవ్వీర్యకలితుఁడు = రాముఁడు, శత్రులయము = శత్రుసంహారమును, అనాకులవృత్తిన్ = అనాయాసముననే, చేసెను, స్వతఃసిద్దమైన మహిమగలరఘునాథుఁడు విశ్వామిత్రునివల్ల నస్త్రముల నభ్యసించి శత్రుజయమును జేయుటకు హేతువుఁ జెప్పుచున్నాఁడు, తత్ = ఆ, అచ్యుత = విష్ణువుయొక్క, తేజము = అంశమయిన రాముఁడు, అంత = అంతైన, రఘునాథునికిని గురువనెడి యనుట, ఘనఖ్యాతి భాసిల, కృపన్ = తనదయవలన, ఆమునిన్ విశ్వామిత్రుని, పురస్కరించి యస్త్రగరిమనుబడసి, రాకుమారు = రాజపుత్త్రునియొక్క, లాగు = రీతిని, ఉరునిరూఢిచేతఁ దిరము కొలిపెను, తాను శిష్యుఁడై విశ్వామిత్రునికిఁ బ్రసిద్ధి గల్పించె ననుట.

వ.

అంత.

29


సీ.

సంయమిదివ్యతేజమునఁ గుంభిని జనిం
            చినయాదిలక్ష్మి నజేయుఁ డైన
విమలశీలుని రఘువీరకులోత్తంసుఁ
            దాగూర్చువాఁ డయితన్నృపాల
వరకుమారకులకు గురువై మనః ప్రీతి
            దనర నత్యాశ్చర్యజనకధామ
భీమబాణాసనస్థేమవార్తాప్రవ
            ర్తనమనుభవ్యసుధన్వినూత్న


తే.

విరచితావధానశ్రుతివీథికలను
ద్రోణులసదాదరైకధురీణుఁ డగుచుఁ
బ్రౌఢి మన్నించె మేదినీపతిసుతులును
దద్ధనుశ్శక్తిపస గాంచుతమిఁ బొదలిరి.

30

రామ. సంయమి = విశ్వామిత్రుఁడు, కుంభినిన్, భూమియందు, దివ్యతేజమున, జనించినయాదిలక్ష్మిన్ = సీతను, రఘువీరకులోత్తంసున్ = రామునిని, కూర్చువాఁడయి =