కవి తాను గల్పించిననియమములలో నొక్కటొక్కటి గాక రెండుమూఁడుభేదకల్పనలనుం జేర్చియుఁ బలుచోట్లఁ గథాసంఘటనంబుఁ గావించియున్నాఁడు: వానికిం గొన్ని యుదాహరణములఁ జూపుచున్నాఁడను.
| ఆ. | "వెలయు నఖిలభువనములలో నవారణ, నగరిపురమతల్లినాఁ దనర్చి | |
ఆ-1. ప-1.
ఇందుఁ బూర్వార్ధమందు రామాయణార్థమున 'అవారణ + నగరిపు + రమ + తల్లినాన్' అనియు, భారతార్థమున 'వారణనగరి + పురముతల్లినాన్' అనియు నన్వయించుచో సంస్కృతాంధ్రభాషాశబ్దశ్లేషయు, నుత్తరార్ధమునందు రామాయణార్థమున 'రాజ్యలక్ష్మి + మిగులన్ ప్రబలన్ +అయోధ్యనాన్' అనియు, భారతార్థమున 'రాజ్యలక్ష్మి + అయోధ్యనాన్ + మిగులన్ + ప్రబలన్' అనియు నన్వయించుచో శబ్దాన్వయభేదసంగతియుఁ గూర్చుటంజేసి రెంటికిఁ గూడిక చెప్పఁబడియె.
| సీ. | "పుడమిఱేఁ డీరీతిఁ గడఁగి డెందము మృగ, వ్యాపారఖేలన మభిలషింపఁ | |
| తే. | మగ్నముగఁ జేయుచప్పుడు భుగ్నహృదయుఁ, డగుచు వినిశితశరవిశేషాభిహతిని | |
ఆ-1. ప-20.
ఇందు మృగవ్యాపారఖేలన మనునెడ రామాయణార్థమున 'మృగవ్య + అపారఖేలన' మనియు, భారతార్థమున 'మృగ + వ్యాపార + ఖేలన' మనియు, సంస్కృతసభంగశబ్దశ్లేషయుఁ, దనరుచొక్కపురాణమునిదంపతు లనునెడ రామాయణార్థమున 'తనరుచు + ఒక్క + పురాణమునిదంపతు' లనియు, భారతార్థమున 'తనరు + చొక్కపు + రాణన్ + మునిదంపతు' లనియుఁ, దమకంబులు దేర ననునెడ రామాయణార్థమున 'తమకు + అంబులు + తేర' ననియు, భారతార్థమున 'తమకంబులు + తేర' ననియుఁ, బూనికలశమంబుమగ్నముగఁ జేయుచప్పు డనునెడ రామాయణార్థమున 'పూని + కలశము + అంబుమగ్నముగన్ + చేయు + చప్పు' డనియు, భారతార్థ