పుట:రమ్యా లోకము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆకసంబున మొలిచి అవ్యక్తనాద
భంగమయమయి, శ్రుతియయి, స్వరజటా క
లాహమై, వర్ణమాల యై, లలితశబ్ద
మయిన భాషాజగత్కళ కంజలింతు.

మనుజు డభిమత చింతనామగ్ను డగుచు
బహుముఖంబులన్ పెక్కు త్రోవలను నడిచె,
తన్నిరంతర దీక్షాసమున్నయమున
అందుకొనె శబ్ద సాధన మక్షయముగ.

సత్తపస్తప్తులయి ఋషీశ్వరులు తొలుత
తన్మయావస్థ నందిన దర్శనముల
కాద్య భాజనమయ్యె నయ్యమృత శబ్ద,
మధికృతస్వరసంహిత యగుచు పొదివి.

శబ్ద మవిభాజ్య సుస్వరచ్ఛందములను
దాటి రూపొందె సూక్త సూత్రములలోన;
తన్మహత్తర పదపాదతంత్రకలన
శక్యమయ్యె శస్త్రప్రాయశాస్త్రపంక్తి,