Jump to content

పుట:రమ్యా లోకము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12


నాయికా నాయకులలోన నాయికయె స
మగ్ర చరితార్థయగును రసార్చనమున,
తన వయోదానమున ప్రసూత ప్రసాద
మంది పునరభిరంజనల్ పొందుకతన.

భోగ సోపాన మెక్కిన రాగవతులు
స్తన్య మోహనమగు స్తనంధయ సతల్ప
చుంబనోపగూహన మహౌత్సుక్యములను
ఆసగొనరె ? పూర్వావస్థ నందరామి.

అవిషయము, లకలంకము, లక్షతములు
అనవగీత కౌమారములయిన సుఖము,
లనుపభుక్తము లగుగాదె వనిత కెందు ?
యౌవనోద్వాంత రతి సమయాంతరముల.

39